ప్రశ్నిస్తే కేసులు,, నిలదీస్తే అరెస్టులు ఇది కాంగ్రెస్ పార్టీ cm రేవంత్ రెడ్డి సిద్ధాంతం.. ఒంటెద్దు నరసింహారెడ్డి..
పట్టుమని పది రోజులు కూడా, అసెంబ్లీ నడిపించలేకపోయారు..
అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలపై చర్చించే వేదిక, అటువంటి వేదికపై కూడా కుల రాజకీయం చేస్తున్న ఘనత రేవంత్ కె దక్కుతుంది..
ప్రశ్నిస్తే కేసులు,, నిలదీస్తే అరెస్టులు ఇది కాంగ్రెస్ పార్టీ cm రేవంత్ రెడ్డి సిద్ధాంతం.. ఒంటెద్దు నరసింహారెడ్డి..
*సూర్యాపేట జిల్లా…*
గరిడేపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి.. పాల్గొన్న మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి.. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణా నాయక్.. సర్పంచులు వార్డు సభ్యులు తదితరులు..
*ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..*
అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు చూస్తే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టిడిపి కాంగ్రెస్ పార్టీ,, పాత కాంగ్రెస్ పార్టీ మధ్య వైరం తారాస్థాయికి చేరిందని అన్నారు…
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి అని అటువంటి జీవన్ రెడ్డిని కూడా పార్టీలో నుండి బయటకు వెళ్లగొట్టడం జరిగిందని అన్నారు…
ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారియర్స్ పై అడ్డగోలు కేసులు పెడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడు CM రేవంత్ రెడ్డి..
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పేరుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సీఎం అని.. డైరెక్షన్ మొత్తం కూడా బిజెపి కనుసైగల్లోనే నడుస్తున్నారని అన్నారు…
తెలంగాణపై నిండు సభలో పార్లమెంటరీలో టిడిపి ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేసిన,, కాంగ్రెస్ బిజెపి ఎంపీలు ఒక్కరు కూడా ఖండించకపోవడం శోచనీయమని అన్నారు..
కాలేశ్వరంపై రేవంత్ రెడ్డి ఏవైతే చిలక పలుకులు పలికారో అవే పలుకులు బిజెపి నాయకులు కూడా పలికారు…
నిరుపేదల ఇల్లు కూలగొట్టి ఆధునికరణ అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా క్షేత్రంలో రానున్న రోజుల్లో తిప్పలు తప్పవని అన్నారు..
మాజీ సర్పంచులకు రావాల్సిన బిల్లులు గురించి అడుగుతుంటే ఎక్కడికి అక్కడికి అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు….. కార్యదర్శులు జోబులోనుండి పైసలు పెట్టి గ్రామపంచాయతీలను నడిపిస్తున్నారని అన్నారు….. కేంద్రం నుంచి వచ్చే గ్రామ పంచాయతీ నిధులు అన్నింటిని అప్పనంగా రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తుందని అన్నారు..
గతంలో కేసీఆర్ పాలనలో గ్రామపంచాయతీ లకి పల్లె ప్రకృతి వనాలని , రైతులకి రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి గ్రామం పంచాయతీలని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు..
ఇప్పుడు గ్రామపంచాయతీలకి నిధులు లేవు అని ఆరోపించారు…
భూకబ్జాలు, అవినీతితో కాంగ్రెస్ పాలన దారి తప్పింది…
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించి భూకబ్జాలు అవినీతితో కాంగ్రెస్ పాలన పూర్తిగా దారి తప్పిందని అన్నారు … అసలు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని, అసెంబ్లీని చర్చల వేదికగా కాకుండా విమర్శలను అణచివేసే స్థలంగా మార్చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు,… కాంగ్రెస్ హామీలు గాలికొదిలి వేశారని, మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు రైతుబంధు, ఉద్యోగాల నోటిఫికేషన్లు మాయ మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు…రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని తెలిపారు… కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూనే, కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 22 అనుమతులు ఉన్నాయని అప్పుడే చెప్పిన నాయకులు, ఇప్పుడు అవినీతి అంటూ మాట్లాడటం రాజకీయ ద్వంద్వ వైఖరని అన్నారు.సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు నమోదు చేయడం, ప్రజల గొంతు నొక్కేలా చట్టాలు తీసుకురావడం ప్రభుత్వ అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డి పాలన సర్వబ్రష్ట పాలనని,
ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని,కాంగ్రెస్ పతనం మొదలైందని ఆయన తెలిపారు.అసెంబ్లీలో అన్పార్లమెంటరీ భాష ఉపయోగిస్తున్న ముఖ్యమంత్రిపై ముందుగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు KLN రెడ్డి, కీత రామారావు, సర్పంచులు మాశెట్టి నాగలక్ష్మి శ్రీహరి, బోద సైదిరెడ్డి, సుధా నాగరాజు, రామ్ సైదులు, మాజీ ఎంపీటీసీ కడియం వెంకట్ రెడ్డి, బానోతు వెంకటేశ్వర్లు, గుగులోతు హేమ్లా నాయక్, మామిడి వెంకటేశ్వర్లు కీతా నాగరాజు, భిక్షం, వీరయ్య గౌడ్, ఉమ్మడి నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు బచ్చలకూరి నాగశేఖర్, సోషల్ మీడియా సభ్యులు పంగ వీరస్వామి, నారాయణ అమరగాని వెంకటేశ్వర్లు బోధ శ్రీనివాసరెడ్డి, బండ్ల గోపాల్, నగేష్ పిల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు..