మళ్ళీ ఓ భార్య కుట్రలో భర్త బలి..

..

భార్యను అపురూపంగా చూసుకునే భర్తను ఓ భార్య ప్రియుడిని పిలిచి చంపించింది. దేవకృష్ణ అనే వ్యక్తికి 12 ఏళ్ల క్రితం ప్రియాంక అనే యువకుడితో వివాహం అయింది. కొన్నాళ్ళకు ఆమె కమలేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను భర్తతో ఉండనని, అతడిని అడ్డు తొలగించమని ప్రియుడు కమలేష్ ను కోరింది. దీంతో కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చి దేవకృష్ణ హత్యకు ప్లాన్ చేశాడు. మూడు రోజుల క్రితం ఇంట్లోకి ప్రియుడితో సహా, సురేంద్ర కూడా వచ్చి దేవకృష్ణను కొట్టి చంపేశారు. ఉదయాన్నే ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి దొంగలు వచ్చి, తమ ఇద్దరినీ వేర్వేరు గదుల్లో పెట్టీ, నగలు, డబ్బు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని చెప్పింది. ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులకు నగలు, డబ్బు కనిపించాయి. దీంతో ఆమె చెప్పింది అబద్ధమని తేలిపోయింది. గట్టిగా విచారించడంతో. అసలు విషయం చెప్పేసింది. ఇండోర్ కు సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది…