సోషల్ మీడియాపై ఏపీలోని కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్. కేవలం పిల్లలకు మాత్రమే కాదు. ఇకపై సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు కూడా…13 ఏళ్ల లోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడంపై విధి విధానాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు ఐటీ శాఖ మంత్రి లోకేష్. దీనికి సంబంధించి ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని పేర్కొన్నారు. దీనిపై గురువారం ఉండవల్లిలో మంత్రుల బృందం సమావేశమైంది.
మంత్రుల బృందం.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, సోషల్ మీడియా దుష్ప్రభావానికి లోను కాకుండా 13 నుంచి 16 ఏళ్ల పిల్లలు వయసు ఆధారిత కంటెంట్ ను అందుబాటులో ఉండేలా విధివిధానాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా చట్టం రూపొందించాలన్నారు.