ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్‌…

ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్‌ దే పైచేయి. ఏకపక్ష మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై పంతొమ్మిదో సీజన్‌లో మూడో విజయం నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో సంజూ శాంసన్(101 నాటౌట్) మెరుపు శతకంతో భారీ స్కోరందించగా.. స్నిన్నర్లు అకీల్ హొసేన్(4-17), నూర్ అహ్మద్‌(2-24)లు ముంబై బ్యాటర్లను వణికించారు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. హిట్టర్లంతా నట్టేట ముంచగా ముంబై 104కే కుప్పకూలగా సీఎస్కే భారీ విజయంతో రెండు పాయింట్లు సాధించింది..ఐపీఎల్‌లో అతి గొప్ప పోరాటాల్లో ఒకటైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ పంజా విసిరింది. వాంఖడేలో సంజూ శాంసన్(101 నాటౌట్) శతక గర్జనతో ముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై స్పిన్నర్ల విజృంభణతో అదిరే విజయం సాధించింది. ఇంప్యాక్ట్ సబ్ అకీల్ హొసేన్(4-17) తన మొదటి ఓవర్లోనే ఓపెనర్‌ డానిష్ మలేవర్‌(0)ను ఔట్ చేసి షాకిచ్చాడు. ముకుల్ చౌదరీ ఓవర్లో డికాక్(7) బంతిని వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగాడు. తన రెండో ఓవర్లో డేంజరస్ నమన్ ధిర్‌(0)ను బౌల్డ్ చేసిన అకీల్ ముంబైని ఒత్తిడిలో పడేశాడు. 11 పరుగులకే మూడు కీలక వికెట్లు పడిన వేళ గత మ్యాచ్ సెంచరీ హీరో తిలక్ వర్మ(37), సూర్యకుమార్ యాదవ్‌(36)లు ఆచితూచి ఆడారు..