ఒడిశాలో ఒక వ్యక్తి తన చనిపోయిన అక్క సమాధిని తవ్వి, ఆమె ఎముకల్ని బ్యాంక్కి తీసుకెళ్లాడు — ఆమె నిజంగా చనిపోయిందని నిరూపించడానికి…
అతను ఆమె ఖాతా నుంచి ₹20,000 తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ బ్యాంక్ అధికారులు “ఖాతా యజమానిని వ్యక్తిగతంగా తీసుకురండి” అని మళ్లీ మళ్లీ చెప్పారు. ఆమె చనిపోయిందని చెప్పినా వినిపించుకోలేదు.
చట్టపరమైన ప్రక్రియ గురించి తెలియక, విసిగి పోయిన అతను ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఈ ఘటన అవగాహన లోపమే కాదు… వ్యవస్థలో మానవత్వం కూడా ఎంత తగ్గిందో చూపిస్తుంది. ..
ఒడిశాలో కియోంఝర్ జిల్లాలో మల్లిపాసి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి తన అక్క చనిపోయిన తర్వాత ఆమె ఖాతాలో నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. దీంతో బ్యాంకు అధికారులు మరణ ధృవీకరణ పత్రం(Death Certificate ),ఇతర డాక్యుమెంట్స్ తీసుకురావాలని చెప్పారు.
నిరక్షరాస్యుడైన ఆ వ్యక్తికి బ్యాంకు అధికారులు చెప్పిన విషయం అర్థం కాలేదు. దీంతో చనిపోయిన వాళ్ల అక్కను పూడ్చిపెట్టిన చోటుకు వెళ్లి, అక్కడ నుండి అస్థిపంజరంగా మిగిలిన ఆ మహిళ శవాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. దీంతో బ్యాంకు అధికారులు భయబ్రాంతులకు గురయ్యారు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులు తన అక్కడ మరణానికి సంబంధించిన రుజువులు అడిగినందుకే, ఇలా చేశానని ఆ వ్యక్తి బదులిచ్చాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జితు అనే ఈ వ్యక్తి సోదరి సుమారు రెండు నెలల క్రితం చనిపోయింది. అయితే ఆమె బ్యాంకు ఖాతాలో సుమారుగా రూ. 19,300 ఉన్నాయి. జితు ఆ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. ఆ ఖాతా అతని సోదరి పేరు మీద ఉంది, కాబట్టి ఆమె డెత్ సర్టిఫికేట్తో పాటు, ఇతర డాక్యుమెంట్స్ అవసరం ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆ తర్వాత జితు, తన అక్కను పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లి, సమాధి తవ్వి ఎముకలను సేకరించి, వాటిని సాక్ష్యంగా బ్యాంకుకు తీసుకువచ్చాడు.దీంతో గ్రామస్తులు ఆ ప్రదేశానికి తరలివచ్చారు.
“పోలీసులు అతనికి విషయం గురించి నచ్చజెప్పి, డెత్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పారు. ఆ తర్వాత అతను తన సోదరి అవశేషాలు ఉన్న సంచితో తిరిగి వచ్చాడు. జితు అమాయకుడు, బ్యాంకులో జమ చేసిన తన సోదరి డబ్బును తీసుకునేందుకు మరణ ధృవీకరణ పత్రాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలనే విషయం అతనికి అర్థం కాలేదు.” అని పాట్నా పోలీస్ స్టేషన్ ఐఐసి ఇరాన్ ప్రసాద్ సాహు తెలిపారు..