తెలంగాణలో ఈ కులాల పేర్లు మార్పు…

తెలంగాణలో ఈ కులాల పేర్లు మార్పు..

తెలంగాణలోని వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సమాజంలో పిలుచుకోవడానికి ఇబ్బందికరంగా, తిట్టు పదాలుగా ఉన్న పలు కులాల పేర్లను మారుస్తూ బీసీ కమిషన్ పంపిన సిఫారసులకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్.. సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు తాజాగా హర్షం వ్యక్తం చేశారు..

_• కొన్ని కులాల పేర్లు మార్చేందుకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొన్నం వెల్లడించారు..

1.’దొమ్మర’ను ‘గడ వంశీయ’గా మార్పు

2.’పిచ్చకుంట్ల’ బదులు ‘వంశ రాజ్’

3.’శూద్ర కులం’ అనే పదం తొలగించి ‘తమ్మలి (బ్రాహ్మణేతర)’గా మార్పు

4.బుడబుక్కలను ‘బుడబుక్కల శివ క్షత్రియ’గా మార్పు

5.’వన్నార్’ బదులు రజక, చాకలి, దోబీ.

6’మేరు’ను ‘మేర, మేరు, చిప్పోలు