ఏపీ సచివాలయంపై డ్రోన్ చక్కర్లు?
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంపై డ్రోన్ తరహా పరికరం చక్కర్లు కొట్టిందనే ప్రచారం కలకలం రేపింది.
ముఖ్యమంత్రి శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
రాష్ట్ర శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యంత భద్రత ఉండే సచివాలయం పైభాగంలో గుర్తుతెలియని పరికరం కనిపించడంతో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు…
ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే, అది డ్రోన్ కాదని, శిక్షణా విమానమని పోలీసులు నిర్దారించినట్లు సమాచారం..