కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హనీట్రాప్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హానీ ట్రాప్, బ్రాక్ మెయిల్ ఆరోపణలతో కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ లో భగీరథ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా కేంద్ర మంత్రి కుమారుడ్నే హానీ ట్రాప్ పేరుతో టార్గెట్ చేయడం రాజకీయంగా, సామాజికంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది..
లైంగిక వేధింపుల వివాదంలో బండి కుమారుడు బండి భగీరథ్
తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రుల
సెక్షన్ 11, 12 ఆఫ్ పోక్సో యాక్ట్ (మైనర్ బాలికపై లైంగిక వేధింపులు), బీఎన్ఎస్ యాక్ట్ 74, 75 సెక్షన్ల కింద బండి భగీరథ్ పై కేసులు నమోదు
ఈ విషయం తెలిసి ముందే కరీంనగర్ లో బాలిక, ఆమె తల్లిదండ్రులపై బండి భగీరథ్ కంప్లయింట్ ఇచ్చినట్టుగా విమర్శలు..
‘నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు.. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు’.బండి బగీరథ్ ఫిర్యాదు
ఈ మేరకు.. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ కుమారుడు బండి బగీరథ్ ఫిర్యాదు
హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఒక కుటుంబం.. రూ. 5 కోట్ల కోసం బ్లాక్మెయిల్ చేస్తోందని వెల్లడి
స్నేహితుల ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయ్యిందని.. ఆలయాలు, పార్టీలకూ వెళ్లామన్న బగీరథ్
కానీ.. మెసేజ్లు, వీడియోలని ఉపయోగించి ఇప్పుడు వాళ్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారని బగీరథ్ ఫిర్యాదు
అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్న బండి బగీరథ్
ఇప్పటికే తాను రూ.50 వేలు ఇచ్చానని.. ఇంకా డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్న బగీరథ్..
నేను అమాయకుడ్ని, నన్ను కాపాడండి అంటూ పోలీసులను వేడుకొంటున్న హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు..