వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య..
ప్రియుడితో కలిసి హత్య చేసి, జేసీబీ సహాయంతో మృతదేహం పూడ్చివేత..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామంలో నివసిస్తూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ముత్యంరెడ్డి(36) అనే వ్యక్తి భార్య కల్పన.m
కొన్ని నెలలుగా ఎల్గోయి గైని పండరి అలియాస్ చింటూ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉన్నాడని ఈ నెల 16వ తేదీన భర్తను హతమార్చిన కల్పన ..
చనిపోయిన తన సోదరుడికి సమాధి కట్టిస్తామని చెప్పి జేసీబీ సహాయంతో గ్రామ శివారులోని తన పొలంలో గుంత తవ్వించి, భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టిన కల్పన..
ఈ నెల 18వ తేదీన భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితురాలు..
విచారణ క్రమంలో అనుమానం వచ్చి నిలదీయగా, తన ప్రియుడితో కలిసి తానే ముత్యం రెడ్డిని హతమార్చినట్లు అంగీకరించిన కల్పన..
దీంతో 9 రోజుల అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి, నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు..