అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్స్ అరెస్ట్.. చిలకలూరిపేట అర్బన్ CI రమేశ్
ఇద్దరు అంతరాష్ట్ర చైన్ స్నాచర్లను అరెస్టు చేసి 3 సవర్ల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నామని చిలకలూరిపేట అర్బన్ CI రమేశ్ తెలిపారు.
చిలకలూరిపేట అర్బన్ PSలో SIలు హజరత్తయ్య, సోమేశ్వరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 03.01.26 న బ్యాంకు కాలనీలో ఒక మహిళ దేవాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో నిందితులు చైన్ ను దొంగలించారు. నిందితులు కృపారావుపై 31 కేసులు, కొండారెడ్డిపై 41 కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయన్నారు.