మాజీ మంత్రి, సీనియర్‌ నేత గాదె వెంకట రెడ్డి కన్నుమూత.

మాజీ మంత్రి, సీనియర్‌ నేత గాదె వెంకట రెడ్డి కన్నుమూత.

_• హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన గాదె వెంకటరెడ్డి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గాదె వెంకటరెడ్డి (85). సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గాదె వెంకటరెడ్డి..

తొలి విజయం: 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, తన 27వ ఏటనే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఓటములు – ఎదురుదెబ్బలు: ఆ తర్వాత రాజకీయాల్లో ఆయనకు అనేక హెచ్చుతగ్గులు ఎదురయ్యాయి. 1972, 1978, 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూశారు. అయినప్పటికీ పట్టువదలకుండా ప్రజల్లోనే ఉన్నారు.
తిరిగి అసెంబ్లీకి: 1991 ఉప ఎన్నికల్లో, ఆ వెంటనే 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
దేవాదాయ శాఖ మంత్రిగా: 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గానికి మారి వరుసగా విజయం సాధించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాలలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు.
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ప్రయాణం:
2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో గాదె వెంకటరెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. దశాబ్దాల పాటు హస్తం పార్టీలోనే కొనసాగిన ఆయన, 2016 ఏప్రిల్ 29న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరారు. అక్కడ నాలుగేళ్ల పాటు కొనసాగిన అనంతరం, 2020 మార్చి 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య కారణాల వల్ల ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు..