రష్యా ఎన్నికలపై ఆత్రుతంగా ఎదురుచూస్తున్న అగ్ర దేశం..

దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అర్మేనియా దేశ రాజకీయాలు ఇప్పుడు భారత్ సహా అనేక పెద్ద దేశాలను టెన్షన్‌లోకి నెట్టాయి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ తీవ్రంగా కొనసాగుతోంది..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా రాజకీయ వర్గాలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం మార్పు కోసం మాత్రమే కాకుండా, అర్మేనియా భవిష్యత్తులో రష్యా ప్రభావ వలయంలోనే కొనసాగుతుందా లేదా యూరప్-అమెరికా వైపు మరింత దగ్గరవుతుందా అనే కీలక నిర్ణయానికి సంకేతంగా మారాయి.

పషిన్యాన్‌కు రాజకీయ అగ్నిపరీక్ష
ప్రస్తుతం అర్మేనియాలో ప్రధాని నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన నాయకత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. 2018 ప్రజా ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన పషిన్యాన్, గత కొన్నేళ్లుగా రష్యాపై ఆధారాన్ని తగ్గించి యూరోపియన్ యూనియన్, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. అయితే అభిప్రాయ సేకరణల ప్రకారం ఆయన పార్టీ అతిపెద్ద శక్తిగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ,