*చార్ బయోమాస్ ప్లాంట్లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు… భయాందోళనకు గురవుతున్న రెండు మండలాల ప్రజలు…*
*చింతలపాలెం,, మెల్లచెరువు మండలాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం..*
సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు రోడ్డులో ఉన్న చార్ బయోమాస్ ప్లాంట్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది…




ప్రమాదం కారణంగా ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

రోడ్డుకు సమీపంలోనే మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చింతలపాలెం–మేళ్లచెరువు మండలాల మధ్య రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు…
ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.. ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా పొలాల్లో మంట పెడుతుండగా అది వచ్చి అంటుకొని తీవ్రస్థాయిలో వంటలు చెలరేగా అన్నది ఇంకా తెలియాల్సి ఉంటుంది.