మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు..!

సీనియర్ రాజకీయ నాయకుడు మరియు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం కారణంగా మరణించారని తెలియజేయడానికి విచారిస్తున్నాము.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ సుదీర్ఘ కాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 22 జనవరి 1953న జన్మించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు..

1953లో కిర్లంపూడిలో జన్మించారు.

1978లో జనతా పార్టీ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఎన్టీఆర్ మరియు చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియచేసేరు..

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

AP: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1953లో తూ.గో జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి MLAగా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు MLA అయ్యారు. NTR, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు..