పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 16వ రోజు..విపక్షాల ఆందోళనల నడుమ లోక్సభలో ‘ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు’ ఆమోదం..
విపక్షాల ఆందోళనల నడుమ లోక్సభలో ‘ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు’ ఆమోదం..
పార్లమెంట్లో గందరగోళం.. నిరసనల మధ్య కీలక బిల్లులు..
సోమవారం (ఆగస్టు 10) పార్లమెంట్ ఉభయ సభల్లో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలకు దిగడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. అనంతరం రాజ్యసభ కూడా కొద్దిసేపటికే వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు తిరిగి సమావేశమయ్యాయి
నిరసనల మధ్య లోక్సభలో నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. అవి:
ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు, 2026
ఖనిజాలు మరియు ధాతువుల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, 2026
కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లు, 2026
రాజ్యసభలో కూడా కొద్దిసేపు కార్యకలాపాలు కొనసాగినప్పటికీ, ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభ తిరిగి వాయిదా పడింది.
ఇక విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026 (FCRA) అంశాన్ని కూడా ప్రతిపక్ష నేతలు చర్చకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లుపై ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశముంది.
మొత్తంగా.. కీలక బిల్లుల ప్రవేశంతో పాటు ప్రతిపక్షాల నిరసనల కారణంగా సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం నుంచే ఉత్కంఠగా సాగాయి.