కుమారుడిని తప్పించి.. డ్రైవర్‌పై కేసా?
టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.!.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడి కారు ప్రమాదంపై కొత్త ఆరోపణలు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ కారు ప్రమాదం వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది..
రాష్‌గా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో చేపల భోగయ్య అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు బాధితులు చెబుతున్నారు అంటు ఆరోపణలు వస్తున్నాయి..
అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది ఎమ్మెల్యే కుమారుడు సాయి గణేష్ అయినప్పటికీ.. అతడిని తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
వెలుగులోకి వచ్చిన చర్చల వీడియో
ప్రమాదం అనంతరం మృతుడి కుటుంబంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వయంగా చర్చలు జరిపినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఉద్యోగం, పెన్షన్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు..
అయితే ప్రమాదం జరిగి ఏడాది గడిచినా తమకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“కేసే లేకుండా చేస్తాడు” అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు?.
బాధితులతో జరిగిన చర్చల సందర్భంగా ఎమ్మెల్యే.. తనకు హైకోర్టు అడ్వకేట్ జనరల్‌తో పరిచయం ఉందంటూ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది..
“ఆయనకు చెప్పానంటే అసలు కేసే లేకుండా చేస్తాడు”,
“రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు”,
“తెల్లవారుజామున 6 గంటలకే ఇక్కడికి వచ్చేస్తాడు”.
అంటూ ఎమ్మెల్యే మాట్లాడినట్లు బాధితులు చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి..
బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు?.
రూ.5 లక్షలు ఇస్తామని, ఉద్యోగం ఇప్పిస్తామని, పెన్షన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు అవేవీ అమలు కాలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మాకు న్యాయం చేయాలి” అంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావును బాధిత కుటుంబం కోరుతోంది.
ప్రమాదానికి సంబంధించిన వీడియోతో పాటు.. ఎమ్మెల్యేతో జరిగిన చర్చల వీడియో, బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
https://www.facebook.com/share/v/188YdnE9jg/
బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు? జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వీడియో లు వైరల్..