నేడు సికింద్రాబాద్ కిమ్స్లో జూ.ఎన్టీఆర్కు సర్జరీ
జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స
భుజం గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతి.
జూ. ఎన్టీఆర్కు నేడు భుజం శస్త్రచికిత్స.
జూనియర్ ఎన్టీఆర్కు భుజానికి గాయం కావడంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆగస్టు 12న హైదరాబాద్లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
క్షుణ్ణమైన వైద్య పరీక్షల అనంతరం ఈ శస్త్రచికిత్సను వైద్యుల బృందం సిఫార్సు చేసినట్లు సమాచారం. కిమ్స్ ఆసుపత్రి నిపుణుల బృందం శస్త్రచికిత్సతో పాటు ఎన్టీఆర్ కోలుకునే ప్రక్రియను పర్యవేక్షించనుంది.
శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
R9TELUGUNEWS.COM