తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం.., హరీష్ రావు సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 5 కేసులు నమోదు..!
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్లను మంగళవారం ఉదయం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తాతామధుపై ఎస్సీ-ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం
తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద ఘటనలో చర్యలకు దిగింది ప్రభుత్వం. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మంగళవారం ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని నివాసంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. తాతా మధుపై ఎస్సీ-ఎస్టీ వేధింపుల కింద కేసు నమోదు చేశారు. స్పీకర్ ఓఎస్డీ ఫిర్యాదుతో సైఫాబాద్ పీఎస్లో కేసు నమోదు చేశారు.