యూపీఐ లావాదేవీలపై కొత్తగా ఫీజులు విధించకుండా మరికొన్ని సంవత్సరాలు జీరో-ఛార్జీ విధానాన్ని కొనసాగించాలీ ..మాజీ నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ రాజీవ్ కుమార్
యూపీఐ లావాదేవీలపై కొత్తగా ఫీజులు విధించకుండా మరికొన్ని సంవత్సరాలు జీరో-ఛార్జీ విధానాన్ని కొనసాగించాలని మాజీ నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ రాజీవ్ కుమార్ niti-aayog-vice-chairman-rajiv-kumar..సూచించారు…యూపీఐని కేవలం చెల్లింపుల వ్యవస్థగా కాకుండా ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే మౌలిక సదుపాయంగా చూడాలని ఆయన అన్నారు. యూపీఐ మౌలిక వసతుల నిర్వహణకు ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.20,000 కోట్ల భారం ఉన్నప్పటికీ, దాని విస్తృత ఆర్థిక ప్రయోజనాలు ఆ ఖర్చు కంటే ఎక్కువని కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న ఫీజు కూడా కొంతమంది వినియోగదారులు, వ్యాపారులను తిరిగి నగదు చెల్లింపుల వైపు మళ్లించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం పరిమాణం పరంగా 96 శాతం యూపీఐ లావాదేవీలు రూ.2,000లోపే ఉన్నప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో దాదాపు 66 శాతం రూ.2,000కు పైగా ఉన్నాయని ఆయన చెప్పారు. అందుకే కరెన్సీ-టూ-జీడీపీ నిష్పత్తి తగ్గే వరకు యూపీఐని ఉచితంగా కొనసాగించడం మంచిదని కుమార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.2,000కు మించిన వ్యక్తి నుంచి వ్యాపారికి (పీ2ఎం) యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించింది. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చినప్పటికీ, వినియోగదారులపై నేరుగా ఎలాంటి ఛార్జీ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.