తెలంగాణ 22A భూముల జాబితా: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు..!

22A భూముల నిషేధిత జాబితాపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్

తెలంగాణ ప్రభుత్వం 22Aలో అమాయక ప్రజల ఆస్తులను చేర్చడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని.. ప్రభుత్వం, అధికారులు అనాలోచితంగా తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయాల వల్ల అమాయక ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారని ఈ నెల 14న జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది తెలిపారు..

సామాన్య అమాయక ప్రజల భూములను నిషేధిత జాబితాలో ఉంచడం వారి మానవ హక్కులకు భంగం కలిగించడమే అని, ఈ ప్రభుత్వ నిర్ణయంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన జాతీయ మానవ హక్కుల సంఘం..

ఈ ఫిర్యాదుపై NHRC సోమవారం విచారణ చేపట్టింది. 22A జాబితా కారణంగా ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలుగుతున్న సంఘం పరిశీలించింది. జీవించే హక్కు, సమానత్వ హక్కు, వృత్తి లేదా వ్యాపారం నిర్వహించే హక్కు, ఆస్తి హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను NHRC పేర్కొంది. ప్రత్యేకంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19(1)(g), ఆర్టికల్ 300-A కింద ఉన్న హక్కులకు సంబంధించిన అంశాలను NHRC పరిశీలించింది. ప్రైవేట్ వ్యక్తుల భూములు 22A నిషేధిత జాబితాలోకి ఎలా చేరాయి, అందుకు సంబంధించిన నిర్ణయ ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశంపై స్వతంత్రంగా నిర్వహించాలని సూచించింది..తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు, కొన్ని నివాస ప్రాంతాలు చేరడంపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 22A సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిశీలించి పరిష్కరించేందుకు కమిటీకి బాధ్యతలు అప్పగించారు. తాజా NHRC ప్రకారం, 22A నిర్ణయంపై తక్షణమే విచారణ చేపట్టి, బాధితులకు అవసరమైన ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. విచారణ చర్యలు, విచారణపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ సీఈఎస్‌ను NHRC ఆదేశించింది.