ఆడవాళ్లు మీకు జోహార్లు రివ్యూ…

తారాగణం: శర్వానంద్‌, రష్మిక మందన్న, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిషోర్‌, సత్య, ఝాన్సీ, సత్యకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజిత్‌ సారంగ్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి
దర్శకత్వం: తిరుమల కిషోర్‌..

కరోనా ప్రభావంతో గత ఏడాదిన్నర కాలం నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌ థియేటర్లకు రావడం చాలా తగ్గిపోయింది. దాంతో మాస్‌, యూత్‌ఫుల్‌ సినిమాలే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు సానుకూలపడటంతో కుటుంబ కథా చిత్రాల రిలీజ్‌కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. ఆ కోవలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సకుటుంబ కథా చిత్రమిదని..ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తూ రూపొందించామని ప్రచార కార్యక్రమాల సందర్భంగా చిత్రబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఎంతవరకు అంచనాల్ని అందుకుందో చూద్దాం..

కథేంటంటే..
ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన చిరంజీవి అలియాస్‌ చిరుకి(శర్వానంద్‌)ఏజ్‌ బార్‌ అయినా.. ఇంకా పెళ్లి కాదు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి నచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన లక్ష్యం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన ప్రతి అమ్మాయిని ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్‌ చేస్తారు. దీంతో తన జీవితంలో ఇక ‘మాంగళ్యం తంతునానేనా ’అనే మంత్రాన్ని ఉచ్చరించనేమోనని బాధపడుతున్న క్రమంలో ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆద్యకు కూడా చిరుపై ప్రేమ ఉన్నప్పటికీ.. అతని ప్రపోజ్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. దానికి కారణం తన తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే నచ్చకపోవడం. వకుళను ఒప్పిస్తేనే ఆద్య తనకు దక్కుతుందని భావించిన చిరు.. ఓ చిన్న అబద్దం చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు వకుళకు పెళ్లి అంటే ఎందుకు నచ్చదు? ఆమె నేపథ్యం ఏంటి? చివరకు చిరు, ఆద్యలు ఎలా ఒక్కటయ్యారనేదే మిగతా కథ.

ఫ్లస్ పాయింట్స్
సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే కామెడీ, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్, స్క్రీన్ ప్లే, రచన, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్, సుకుమార్ వాయిస్ ఓవర్, రష్మిక స్టయిల్, లుక్, శర్వానంద్ యాక్టింగ్.

మైనస్ పాయింట్స్
మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్, గెస్ చేసే కథ

కన్ క్లూజన్
మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. ఈ సినిమా ఫుల్ టు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా. ఈ సినిమా కేవలం క్లాస్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కే నచ్చుతుంది. మాస్ ఆడియెన్స్ ఏదో ఊహించుకొని ఈ సినిమాకు వెళ్తే మాత్రం కష్టం. కాస్త కామెడీతో ఎంటర్ టైన్ మెంట్ కావాలనుకుంటే ఈ సినిమాకు ఖచ్చితంగా వెళ్లొచ్చు. ఒకసారి చూసి ఎంజాయ్ చేసి వస్తారు.
తెలుగున్యూస్ రేటింగ్ : 3/5..