మూడురోజుల్లో గడువుతో ముగుస్తుంది…..

ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువు....

మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత ఐటీ రిటర్నులను సమర్పించడం వీలుకాదు. అందువల్ల ఇంకమ్‌ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు మార్చి 31లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి..ఆధార్‌ కార్డుతో పాన్ కార్డు లింకేజీని ఇంకా చాలా మంది ఉద్యోగులు పూర్తి చేయలేదు. ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. గతంలో ఈ గడువును కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది. ఒకవేళ మార్చి 31లోగా మీరు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. అందువల్ల ఇప్పుడే ఆధార్-పాన్ లింకేజీని పూర్తి చేయండి. లేకపోతే రూ.10వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు. మీ బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయండి. పాన్, ఆధార్, అడ్రస్ ఐడెంటిటీల వివరాలను మార్చి 31లోగా సమర్పించండి. బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయకుంటే మీరు చాలా ప్రయోజనాలను పొందలేరు. అందువల్ల ఈ పనిని మీ బ్యాంక్ శాఖకు వెళ్లిపూర్తి చేయండి…కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయాలి….. వివాద్ సే విశ్వాస్ పథకంలో భాగంగా పన్ను బాకీలను కూడా మార్చి 31లోగా చెల్లించండి. ఇలా చెల్లిస్తే వడ్డీతో పాటు అపరాధ రుసుములను రద్దు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. కనుక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి… తెలంగాణలో వాహనాల పెండింగ్ ఛలానాలపై ప్రకటించిన డిస్కౌంట్ మార్చి 31లోగా ముగియనుంది. దీంతో వాహనాలపై ఛలానాలు ఉన్నవారు ఇప్పుడే డిస్కౌంట్ ఉపయోగించుకుని చెల్లింపులు చేయండి.