ఈ నెల 6 వ తేదీన ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ పై సమీక్ష సమావేశం..!!

ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ పై పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ నెల 6 వ తేదీన ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజ్యసభ, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు..