అబుదాబిలో తొలి హిందూ దేవాలయం..!!

ఈ ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మహంత్ స్వామి మహరాజ్(Mahant Swami Maharaj) సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) చొరవతో., బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ ఈ ఆలయ నిర్మాణకర్త. ఎర్పాటు చెయ్యడం జరిగింది..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య ప్రాచ్య దేశాల్లో ఇదే మొట్టమొదటి హిందూ దేవాలయం కానుండటం విశేషం. 27 ఎకరాల్లో ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయం బడ్జెట్ సుమారు రూ.700 కోట్లు.

అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని(Hindu Temple)శుక్రవారం సాధారణ ప్రజల(general public) కోసం తెరిచారు. ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం తెరిచి ఉంటుందని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) తెలిపింది. ఈ ఆలయాన్ని BAPS 27 ఎకరాలలో సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మించగా.. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది.
ఆలయం ప్రారంభం నేపథ్యంలో భక్తులు(devotees) పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లైన జంట వారి వివాహం అయిన మొదటి రోజున ఆలయానికి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడికి వచ్చి భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాదు ఆలయ వాస్తుశిల్పం అపురూపంగా ఉందన్నారు. అబుదాబిలోని BAPS దేవాలయం మధ్యప్రాచ్యంలో మొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం. ఇది భారతదేశం, UAE మధ్య బలమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక సమ్మేళనం, మతాల మధ్య సామరస్యం, సహకారం స్ఫూర్తిని సూచిస్తుంది. ఈ సందర్భంగా యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ భారత్-యూఏఈ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. భారత్-యూఏఈ సంబంధాలను ఉద్ఘాటిస్తూ యూఏఈలో ప్రధాని మోడీ పర్యటనలను గుర్తు చేసుకున్నారు. గత 9-10 ఏళ్లలో ప్రధాని మోదీ(narendra modi) ఈ దేశానికి ఏడుసార్లు రాగా, రెండేళ్లలో నాలుగుసార్లు ఇక్కడికి వచ్చారని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ప్రధాని మోదీ చివరి పర్యటన చాలా ముఖ్యమైనదని భారత రాయబారి చెప్పారు. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. UAEలో ప్రస్తుతం 3.5 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు ఉన్నారు. ఈ క్రమంలో వీరంతా మరికొన్ని రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించుకోనున్నారు..