ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి…

*లంచం తీసుకుంటూ ఏసీబీకి వలకు చిక్కి ఏడ్చేసిన మహిళ అధికారి.

ఓ ప్రభుత్వ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగ జ్యోతి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఓ వ్యవహారంలో సంతకం కోసం జగ జ్యోతి బాధితుడి నుంచి రూ.84,000 లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ACBని ఆశ్రయించగా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలో జగ జ్యోతి కన్నీరు పెట్టుకుంది…