ఏసిబి కి పట్టుబడ్డ సూర్యాపేట రూరల్ ఎస్సై లవకుమార్..

రాజు గారి తోటలో లవకుమార్ ఏ.సి.బి చిక్కాడు..

సూర్యాపేట జిల్లా..

నిన్న రాత్రి జిల్లా లోని కొందరు యస్.ఐ లకు స్థాన చలనం జరిగింది…

స్థాన చలనం జరిగిన యస్.ఐ లు 24 గంటల్లో విధుల్లో చేరాలి.. అందులో భాగంగా
బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఎస్ ఐ లవకుమార్ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తోన్న లవకుమార్ బుధవారం రాత్రి జిల్లా యస్.పి కార్యాలయం కు బదిలీ అయ్యారు.

లవకుమార్ యస్.ఐ శుక్రవారం జిల్లా కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.

కానీ గురువారం మధ్యాహ్నమే ఏసీబీ అధికారులకు చిక్కాడు.

సూర్యాపేట మండల పరిధిలోని రాజుగారి తోట హోటల్ యాజమాన్యం నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

వీఆర్‌కు వెళ్తూ కూడా ఎస్.ఐ అవినీతికి పాల్పడటం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.