ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ..

*సూర్యాపేట జిల్లా….

హుజూర్ నగర్ పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో 5000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మేళ్లచెరువు పంచాయితీ ae రంగరాజ్….

మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండా మాజీ సర్పంచ్ కృష్ణా నాయక్ ఎల్ఈడి బల్బులు కి సంబంధించిన వ్యవహారంలో బిల్లులు జాప్యం చేయడంతో ఏసీబీ ని ఆశ్రయించడం జరిగింది.. ఎంబి రికార్డు చేసేందుకు 5000 లంచం డిమాండ్ చేసిన మెల్ల చెరువు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును అవినీతి నిరోధక శాఖ అధికారులు పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం….

కప్పల కుంట తండాకు చెందిన ధరావత్ కృష్ణ పంచాయతీ రాజ్ పనులు చేయగా దానికి ఎంబి రికార్డు బిల్లు చేసేందుకు 5000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది.. దీంతో 5000రూపాయిలు లంచం తీసుకుంటుండగా తాము వలపన్ని పట్టుకున్నామని తెలిపారు…