నేనంటే పడని వాళ్లు.. నా మీద ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేశారు…కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ …

టీవీ రిపోర్టర్ నన్ను చెంపపై కొట్టి.. తప్పుడు న్యూస్ ప్రచారం చేసింది.. కోయిలమ్మ నటుడు..

ఇటీవల కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాగి తమపై దౌర్జన్యం చేశాడంటూ ఇద్దరు యవతులు ఇతనిపై ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదు అయ్యింది.అయితే వ్యాపారలావాదేవీల్లో తేడాలు రావడంతో వీరి మధ్య గొడవలు తలెత్తినట్టు పోలీసులు దర్యాప్తులో తేలడంతో ఇరువర్గాల పిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. వీటన్నింటపైనా క్లారిటీ ఇస్తూ..
ఆ రాత్రి అసలు ఏం జరిగింది? గొడవకు గల కారణాలు ఏంటి? అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చాడు అమర్…‘నేనంటే పడని వాళ్లు.. నా మీద ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేశారు.. నేను తాగి వెళ్లానని అన్నారు.. లైంగికంగా వాళ్లని వేధించానని వార్తలు ప్రసారం చేశారు. వీటిపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.. నేను అన్ని టెస్ట్‌లు చేయించుకున్నా.. బ్లడ్ రిపోర్ట్స్ ఇవిగో..
గొడవ జరిగిన 24 గంటల్లో నేను టెస్ట్‌లు చేయించుకున్నా.. ఇది డాక్టర్ ఇచ్చిన పేపర్ ప్రూఫ్.లైంగిక వేధింపులు చేశానని అన్నారు.. ఎఫ్ ఐ ఆర్ కాపీలో 509, 506 సెక్షన్ల కింద కేసు కట్టారు. అది చిన్న కేసు.. స్నేహితుల మధ్య గొడవ వచ్చినప్పుడు మధ్యలో వేరే వ్యక్తి రావడంతో గొడవ పెద్దదైంది…రష్మి, శ్రీ విద్య ఇద్దరూ మా కామన్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం వల్ల మధ్యలోనే విడిపోయారు. అయితే రష్మికి సంబంధించిన లాప్ టాప్, బట్టలు, కొన్ని వస్తువులు అక్కడే ఉండిపోవడంతో ఆమె నన్ను అడిగింది వెళ్లి తీసుకునిరమ్మని. నాతో పాటు రష్మి వాళ్ల కజిన్ కూడా వచ్చాడు.. ఆమెకు హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను వెళ్లాను. వాళ్ల కజిన్ వెళ్లి అడిగాడు.. రష్మి వస్తే ఇస్తాం మీకు ఇవ్వం అని వాళ్లు చెప్పడంతో నేను వెళ్లి.. ఎందుకు గొడవ మీరు ఫ్రెండ్స్‌నే కదా.. అని మాట్లాడుతుంటే అపర్ణ రమేష్ అనే అమ్మాయి ఎవరికో కాల్ చేసి ముగ్గురు వచ్చి మాతో గొడవ పెట్టుకున్నారు…ఆ గొడవలో మీడియాకి సంబంధించిన ఒక ఆమె.. నన్ను చెంపదెబ్బ కొట్టారు. ఆమె ఎందుకు కొట్టారు అనేది నాకు తెలియదు. కానీ ఆమె ప్లాన్ చేసినన్ను కొట్టిందని నాకు అర్థమైంది. వేరే వ్యక్తికి ఫోన్ ఇచ్చి వీడియో తీయిస్తూ.. నన్ను చెంపదెబ్బ కొట్టింది.. ఆ తరువాత నేను రియాక్ట్ అయినది మాత్రమే కట్ చేసి మీడియాకి షేర్ చేసింది…ఈలోపు ఆ రౌడీ షీటర్ మరికొంతమంది గూండాలకు కాల్ చేయడంతో.. ప్రాణభయంతో మేము పోలీసులకు కాల్ చేశాం. వాళ్లు వచ్చేలోపే గూండాలు వచ్చి.. నన్ను రౌండప్ చేశారు. ఇంతలో రష్మి.. మా ఫ్రెండ్ స్వాతికి ఈ గొడవ ఫోన్ చేసి చెప్పింది.స్వాతి వచ్చి డోర్ తీయగానే.. అక్కడ ఉన్న ఫీమేల్స్ ఇద్దరూ స్వాతిని బండబూతులు తిట్టారు. మేం అంతా ఎలాగోలా అక్కడ నుంచి బయటపడేసరికి పోలీసులు వచ్చారు. ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. మాతో మాట్లాడారు.నన్ను చెంపపై కొట్టింది.. మీడియాలో నాపై దుష్రచారం చేసింది టీవీ 5 రిపోర్టర్ ఉమా వర్మ. ఆమెకు మాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆమె అక్కడకు ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలియదు. నా ఫ్రెండ్స్‌కి ఈమె ఎలా పరిచయం అయ్యిందో కూడా తెలియదు. అపర్ణ రమేష్ అనే అమ్మాయి కాల్ చేస్తూ వీళ్లు సీన్‌లోకి వచ్చారు.నాగురించి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.. టీవీ 5 ఉమనే చేసిందా? అన్నది తెలుసుకుంటున్నా. నాకైతే నా మీద తప్పుడు ప్రచారం చేసిన వాళ్ల నుంచి సంజాయిషీ కోరుతున్నా. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల నా కెరియర్ దెబ్బపడింది. నేను జైలులో ఉన్నాను.. కేసులు పెట్టారు.. అరెస్ట్ చేశారు అంటూ చాలా తప్పుడు వార్తలు ప్రసారం చేశారు’ అంటూ ఆధారాలతో సహా అన్ని విషయాలను మీడియాకి వివరించాడు టీవీ నటుడు అమర్…