ఆచార్య ట్రైలర్ విడుదల…

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఎప్పట్నుంచో ట్రైలర్ కోసం ఎదురుచూస్తోన్న మెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ఆచార్య ట్రైలర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో.. అమ్మవారి సెంటిమెంట్ తో తండ్రి కొడుకుల నటనను చూపించాడు దర్శకుడు. ట్రైలర్ లో ముందుగా రామ్ చరణ్ (సిద్ధ) కనిపిస్తాడు. పాదఘట్టం అనే గ్రామం.. ఆ గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయం చుట్టూ జరిగే కథలా అనిపిస్తుంది. ఆ గ్రామస్తుల జోలికి ఎవరొచ్చినా సిద్ధ అండగా నిలుస్తాడు. అలాంటి సిద్ధకు ఆపదొస్తే.. ఆచార్య రంగంలోకి దిగుతాడని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. కానీ.. ట్రైలర్ లో ఎక్కడా కాజల్ కనిపించలేదు. కీలక పాత్రల్లో తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు నటించారు. ఏప్రిల్ 29న ఆచార్య థియేటర్లలో విడుదల కానుండగా.. 24వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుంది…మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా ట్రైలర్ వచ్చేసింది..మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య మూవీ తాలూకా ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ముందుగా ఈ మూవీ ట్రైలర్ ని 153 థియేటర్లలో చిత్ర బృందం సాయంత్రం 5:49 నిమిషాలకు విడుదల చేశారు. థియేటర్లలో ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.