చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్…

Kg బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుని ఇంట్లోకి ప్రవేశించి పక్కా ప్లాన్తో ఆమె ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ సహా పలు మూవీల్లో సౌమ్య నటించింది…

Actress Soumya Shetty Arrest: రంగుల కలల ప్రపంచం…. అప్పటి వరకు అనామకురాలిగా ఉన్నవాళ్లను రాత్రికి రాత్రి స్టార్ ను చేయడానికి ఒకే ఒక క్లిక్ చాలు… అలా ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ కు బాటలు వేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాదని ఒక్కసారిగా వచ్చిన ఫేమ్, పరిచయాలు, పార్టీలతో అడ్డదారుల్లో సాగితే వాటికోసం చేసే తప్పులతో ఇదిగో ఇలా విశాఖ(Viska)కు చెందిన యూట్యూబర్(Youtuber) లా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
అందాల భామ చేతివాటం
మత్తిక్కించే తన కళ్లతో.. వీడియోలతో సామాజిక మాద్యమా(Social Media)ల్లో అనతికాలంలో మంచి పేరు తెచ్చుకుంది విశాఖ(Vizag)కు చెందిన సోషల్ మీడియ ఇన్ ఫ్లూయెన్సర్, నటి సౌమ్య శెట్టి. ఈ అమ్మడికి కళలంటే ప్రాణం.. సోషల్ మీడియాలో రీల్స్(Reels) చేసి పాపులర్ అయిన ఈ చిన్నది… ఇప్పుడు కటకలాపాలై మళ్లీ పాపులర్ అయ్యింది. విశాఖలోని దొండ పర్తిలో రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయ్ ఇంట్లో చోరీ చేసి సుమారు 100 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించిన నటి సౌమ్య శెట్టి.. ఆ డబ్బుతో గోవాలో ఎంచక్కా ఎంజాయి చేస్తూ దొరికిపోయింది.
స్నేహితురాలిగా నమ్మించి మోసం
ఇన్ స్టాగ్రామ్(Instagram) లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య… ఒకటి, రెండు చిన్నాచితకా చిత్రాల్లోనూ నటించింది. విశాఖకే చెందిన మరో సోషల్ మీడియ ఇన్ ఫ్లూయెన్సర్(Social Media Influencer) మౌనికతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ తరుచూ వీడియోలు ఎలా చేయాలి. లైక్ లు రావాలంటే ఏం చేయాలని ఫోకస్ చేసేవారు. ఆ పరిచయం స్నేహంగా మారడంతో అప్పుడప్పుడు సౌమ్య మౌనిక ఇంటికి వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో నేరుగా మౌనిక బెడ్ రూంకి వెళ్లేది. సౌమ్య గంటల తరబడి అక్కడే ఉండటంతో.. ఏంటని మౌనిక ప్రశ్నిస్తే… ఫోన్ మాట్లాడుతున్ననంటూ దాటవేసేది. అలా వెళ్లిన ప్రతిసారీ అమ్మడు చేతివాటం ప్రదర్శించేది. మౌనిక దాచుకున్న బంగారు నగలు గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసింది. సుమారు వందగ్రాముల వరకు బంగారం చోరీ చేసింది. కొన్ని రోజుల తర్వాత బంగారం మాయమైనట్లు గుర్తించిన మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరిపైనా అనమానం లేదని.. సౌమ్య తరుచూ ఇంటికి వచ్చేదని తెలిపారు. దీంతో ఆమె కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అసలు దొంగ తనేనని తేల్చారు.
గోవాలో ఎంజాయ్
మౌనిక ఇంట్లో కొట్టేసిన బంగారంతో సౌమ్య గోవా టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసింది. అకస్మాత్తుగా ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన పోలీసులు… గట్టిగా నిలిదేసే సరికి నిజం ఒప్పుకుంది. మొత్తం వంద తులాల బంగారం పోయిందని మౌనిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా…సౌమ్య 75 తులాలు తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. అందులో 50 తులాల బంగారం రికవరీ చేయగా… మిగిలిన బంగారం అమ్మేసి ఖర్చు చేశానని చెప్పింది. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటా’ అంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 15 రోజుల రిమాండ్ కు తరలించారు. స్నేహితురాలని నమ్మి ఇంటికి పిలిస్తే… సౌమ్య ఇంతపని చేస్తుందనుకోలేదని మౌనిక కన్నీటి పర్యంతమైంది. 2016 ఓ మూవీ ఆడిషన్ లో తను పరిచయం అయ్యిందని.. అప్పటి నుంచి నమ్మకంగా స్నేహం చేసిందన్నారు. ఇంటికి వచ్చిన ప్రతిసారీ తన వాష్ రూమ్ వాడుకునేదని.. ఈ క్రమంలో బెడ్ రూంలో ఉన్న బంగారం కొట్టేసిందని తెలిపింది. ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. తస్కరించి అమ్మిన బంగారంతో సౌమ్య ఐదులక్షలతో ప్యామిలీ మొత్తాన్ని గోవా ట్రిప్ నకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే ఒక లక్షన్నరతో కారు రీమోడలింగ్ చేయించుకున్నట్లు తేలింది..