చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు షాక్…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది..
తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎన్‌ఎస్‌యుఐ నేత బల్మూరీ వెంకట్‌ల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్‌ అధికార ప్రకటన విడుదల చేశారు. రేపు గురువారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో వారిద్ధరు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారికి బీఫామ్‌ల జారీ.. నామినేషన్ల దాఖలు బాధ్యతను సీనియర్ నేత టి.జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించింది…

ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మొదట ఈ రెండు స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలని ఇరువురికి పార్టీ హై కమాండ్ సూచించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో అనూహ్యంగా అద్దంకి దయాకర్‌కు చోటు దక్కకపోవడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంతో అద్దంకికి మరో పోస్ట్ ఏదైనా ఇస్తారా అని చర్చ జరుగుతోంది..

ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు…. పార్టీలో ఎప్పుడు విధేయుడు గానే ఉంటానని పార్టీలో ఇంకా సముచిత న్యాయం తనకు దక్కుతుందని నమ్మకం ఉందని పార్టీ ఎవరు కూడా వ్యాఖ్యలు చేయవద్దని తన అభిమానులకి తన అనుచర నాయకులకు సోషల్ మీడియా ద్వారా తెలిపారు… కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం జరగదని కచ్చితంగా పార్టీలో సముచిత న్యాయం దానికి దక్కుతుందని అన్నారు… కొంతమంది ఏదో లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తారని అటువంటి వాటిని వీటిని కూడా పరిగణంలోకి తీసుకోవద్దని అన్నారు..