అర్థరాత్రి నుండే ఆధార్ అప్డేట్ కోసం జనల పాడిగాపులు..!..

*అర్థరాత్రి నుండే ఆధార్ అప్డేట్ కోసం జనల పాడిగాపులు..!*

*అర్థరాత్రి 1 గంట కు ఆధార్ కేంద్రానికు చేరుకొని అక్కడే నిద్రిస్తున్న జనాలు..!*

*మహిళల చిన్నారుల అవస్థలు..!*
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు..

ఆధార్ కార్డు అప్డేట్ కోసం తెలంగాణ పలు జిల్లాలో జనాలు అవస్థలు పడుతున్నారు..పట్టణంలో అర్థరాత్రి 1గంట నుండి ఆధార్ కేంద్రానికి చేరుకొని అక్కడే నిద్రిస్తూ చలికి మంటను కాల్చుకుంటూ తెల్లారే సరికి టోకెన్ తీసుకొని ఆధార్ అప్డేట్ కోసం అడ్రస్ మార్పు కోసం గత కొంత కాలంగా ఆధార్ అప్డేట్ చేసుకొని వారు సైతం వచ్చి ఇప్పుడు కేంద్రల వద్ద పడి గాపులు కాస్తున్నారు ఇక ప్రభుత్వము అరు గ్యారంటీ లను ప్రకటించడంతో ఒక్కసారిగా ఆధార్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో కొలువుదీరిన పరిస్థితి వివాహం తర్వాత మహిళలు తమ అడ్రస్ చేంజ్ చేసుకోవడం అదేవిధంగా ఒక జిల్లా నుండి మరో జిల్లాగా మారిన తర్వాత ఆధార్ అప్డేట్ రేషన్ కార్డు ఇతర ఏదైనా పని నిమిత్తం ఆధార్ కార్డు అవసరం పడుతుంది కాబట్టి జనాలు ఒక్కసారిగా ఆధార్ సెంటర్ కు రాత్రి పూట వచ్చి అక్కడే నిద్రిస్తున్నరు క్యూ లైన్ లో నిలబడి టోకెన్లు తీసుకుంటున్నారు..

రేషన్ కార్డు లోకి చేర్చాలంటే ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలంటూ రేషన్ డీలర్లు తెలుపుతున్నారు… ఇంట్లో ఉన్న చిన్న పిల్లలవి కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసి ఉంటేనే వారికి రీసన్ ఇస్తామంటూ కొందరు ఇబ్బందులకు గురి చేయడంతో చిన్న పిల్లలను సైతం కూడా తీసుకొని వెళ్లి తెల్లవారులు ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు..

ఈ చికాకుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు గత ప్రభుత్వం సకలజనుల సర్వే అంటూ ఇంటింటికి వచ్చి రాసుకొని పోయిన డేటా ఏమైందని మళ్లీ ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అన్ని రకాల జిరాక్స్ లు పెట్టి తమకు సబ్మిట్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..