కొనలేం..తినలేం.!.. పండగ వేళ నిత్యావసర సరుకులు అధిక రేట్లతో సతమతమవుతున్న సామాన్య ప్రజలు…

కొనేట్టు లేదు.. తినేటట్టు లేదు..
ధరలు ఎట్లా మండుతుంటే సామాన్యుడు చెబుతున్న మాటలివి……..
నిత్యావసర సరుకులు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి…….
ధరల పెంపును అరికటలేకోతున్నరు..

నిత్యావసరాల ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి.trong>

దినసరి చర్యగా రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు..

చాలీచాలని జీతాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు…..

పండుగ సమయంలో షాపింగ్ లకు దూరంగా..!
హంగులు ఆర్భాటాలకు దూరంలో సామాన్యులు..

కరోనా కష్టకాలంలో ఉపాధిలేక ప్రజలు అల్లాడిపోయారు…ధరలు ఆకాశాన్ని అంటడంతో బతుకు భారమవుతోంది. ఉల్లి ధరలు వింటేనే కన్నీరు తెప్పిస్తుండగా, నూనెల ధరలు సలసల కాలిపోతున్నాయి. కూరగాయల ధరలు సైతం పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పండుగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనడానికి, ఇంట్లో పిండి వంటలు చేయడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దేశంలోని పది ప్రధాన నగరాల్లో ప్రస్తుతం ప్రజల ఆలోచన తీరు ఇలాగే ఉంది. ధరల మంట వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి బతుకు భారమవుతోంది. ఉల్లి ధరలు మంట పుటిస్తున్నాయి. నూనెలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

గ్యాస్ సిలిండర్ ధర…
బండ బాదుడు.. రూ.2000 దాటిన వాణిజ్య సిలిండర్‌ ధర

దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు ఒకటో తేదీ షాకిచ్చాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరోసారి పెంచాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ. 266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2000 దాటడం గమనార్హం. అయితే ఇళ్లల్లో ఉపయోగించే డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను పెంచకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది..

తాజాగా పెంచిన వంట గ్యాస్‌ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు..

నిత్యావసర ధరలు మునుపెన్నడూ లేనివిధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి… సామాన్యులు కనీసం కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది…. పెట్రోల్ చూస్తే వందకు పైన ఉన్నది.. గ్యాస్ సిలిండర్ ధర చూస్తే 1100 పైనే ఉన్నది….. నిత్యావసర సరుకుల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి… ఏ వస్తువు ను పట్టుకున్న పెరిగిన రేట్లతో కొనుగోలు చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు..

నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు..
సామాన్యులకి గుదిబండగా మారిన గ్యాస్ బండ.. గ్యాస్ పోయి ని వెలిగించాలంటే గృహిణి భయం మొదలైంది… ఉల్లిగడ్డ కోరకుండానే కంట నీరు తెప్పిస్తోంది…టమాటా వండకుండానే నీరు గారి పోతుంది…నిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల ఈ విషయంలో సామాన్యులు ఇబ్బంది అవుతున్నారు… ఆదాయం అంతంత మాత్రం ఉండి… ధరలు అధిక మొత్తంలో ఉండేసరికి సామాన్యులు పండగలు కుడా పక్కన పెట్టే పరిస్థితి దాపురించింది.. అప్పులు చేసి మరి నిత్యవసరాలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన కొనుగోలుదారులకు ధరలు షాక్‌ తినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజానీకానికి కరోనా తగ్గుదలతో కొంత ఊరట లభించినా ధరల పెంపు వారిని తిరిగి అఘాదంలోకి నెడుతున్నాయి. ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఏం కొనాలో, ఏం తినాలో పాలుపోక అల్లాడుతున్నారు. చక్కెర, ఉప్పు, చింతపండు మొదలు ప్రతి వస్తువుపై కనీసం రూ.30 వరకు ధరలు పెరిగాయి. ఆయిల్‌ ధరలు గత మూడు నెలలుగా భారీగా పెరిగాయి. ప్రతినెలా రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుతునే ఉన్నాయి.

కొండెక్కిన కోడి ధర
మార్కెట్‌లో కిలో చికెన్‌ రూ. 280….

కొవిడ్‌ నేపథ్యంలో కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుంది. బ్రాయిలర్‌ చికెన్‌కు గిరాకీ ఏర్పడింది. దుకాణాల్లో స్కిన్‌లెస్‌ కిలో రూ.280, స్కిన్‌తో రూ.260 ధరకు విక్రయిస్తున్నారు. కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు పోషకాహారంలో భాగంగా గత నాలుగు నెలలుగా బ్రాయిలర్‌ చికెన్‌ ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో, ఆసుపత్రులలో కొవిడ్‌ బాధితులకు పోషకాహారంగా చికెన్‌ అందిస్తున్నారు. ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంది..

లాక్‌డౌన్‌ నుండి ప్రభావం,..

ఈ ఏడాది మేలో అమలు చేసిన కర్ఫ్యూ ఆంక్షలతో సామాన్యుల ఉపాధి అవకాశాలపై ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్య జనం ఆదాయాలు బాగా పడిపోయాయి. ఇప్పటికే అన్నిరకాల నిత్యావసరాల ధరల పెరిగి ఏమీ కొనలేని పరిస్థితుల్లో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలపై ధరల పెంపు మూలుగుతున్న నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. కాస్తా కూస్తో వచ్చిన ఆదాయంతో నెట్టుకొస్తున్న సామాన్య జనంపై కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలు వారి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తున్నాయి…
ఉల్లి రేటు చుస్తే .. ఉల్లిని కోరకుండానే కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి.. ఉల్లి రేటు అమాంతం పెరిగిపోవడం వల్ల ఉల్లిగడ్డ వాడకం తగ్గిస్తున్న మధ్యతరగతి కుటుంబీకులు…

కూరగాయల ధరలు…!

నగరంలో మార్కెట్లలో టమాటా కిలో రూ.60. ఎగబాకింది. బిన్నీస్‌ కిలో రూ.100 నుంచి రూ.120 మధ్య ఉంది. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. దీంతో నగరవాసులు కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారు. ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండడతంతో ప్రజలు బంబేలెత్తి పోతున్నారు….

కరోనాతో ఉపాధి పోయింది.. ప్రస్తుత ధరలు చుస్తే బ్రతుకే భారం అవుతుంది..

మార్కెట్‌కు వెళ్లి కిరాణా సరుకులు కొనాలంటేనే భయమేస్తోంది. రూ. 1000 తీసుకెళ్లినా సంచి నిండా సరుకులు రావడం లేదు. కరోనా కాలంలో ఉన్న ఉపాధి కూడా కోల్పోగా ప్రస్తుతం ధరలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పెరిగిన ధరల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ప్రభుత్వాలు స్పందించి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి..

ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలం… నిత్యం అమాంతం పెరుగుతున్న రేట్లను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని. సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి ధరలను అధికం చేయకపోతే సామాన్యుల బతుకుదేరువు ప్రశ్నార్థకంగానే మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..