నింగిలోకి దూసుకెళ్లిన..ఆదిత్య ఎల్‌1 ప్రయోగం విజయవంతం..

చంద్రయాన్‌-3 విజయవంతంతో దూకుడుమీదున్న ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. మిషన్‌లో భాగంగా శనివారం పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్‌ను విశ్వంలోకి మోసుకెళ్లనున్నది. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను ఇస్రో లాగ్రాంజియన్‌ పాయింట్‌ -1లో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది…

అంతరిక్ష అద్భుతానికి నాంది పడింది. సూర్యుడిపై రహస్యాలను చేధించేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్‌1 ప్రయోగం విజయవంతగా మొదలైంది. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. నెలల పాటు ప్రయాణించి ఎల్‌1 కక్ష్యలోకి ప్రవేశించనుంది. సూర్యుడిపై ఆదిత్య ఎల్‌1 ప్రయోగాలు చేయనుంది. ఎలాంటి అవంతరాలు లేకుండా రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి దూసుకు వెళ్ళింది..

ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్ తో ఇస్రా అభినందనలు తెలిపింది.. షార్ లో శాస్త్రవేత్తల సంబరాలు.. ఐదేళ్లకు పైగా పరిశోధన చేయనున్న ఆదిత్య L1.. నాలుగు నెలలపాటు ప్రయాణించనున్న ఆదిత్య L1.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అధిత్య L1..
నిర్ణీత కక్షలు రాకెట్ నుంచి విడిపోవడంతో ఆదిత్య యల్ వన్ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు..

సూర్యుడిపై సోలార్ స్టార్మ్స్‌ను స్టడీ చేయనుంది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్1 ముందుగా భూమి నుంచి సూర్యుడి వైపు 125 రోజుల ప్రయాణం చేసి లాంగ్రాంజ్ పాయింట్ ఎల్1ని చేరుకుంటుంది. ఇక ఈ ప్రయోగం కోసం రూ.358 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా.. తెలిపేరు..

ఈ రోజు ఉదయం 11:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది ఆదిత్య ఎల్‌-1 రాకెట్. ఇది సూర్యుడు-భూమి మధ్యలోని లాంగ్రాంజ్‌ పాయింట్‌-1 వైపు పయనించి, సూర్యుడిపై సోలార్ స్టార్మ్స్‌ను స్టడీ చేయనుంది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్1 ముందుగా భూమి నుంచి సూర్యుడి వైపు 125 రోజుల ప్రయాణం చేసి 15 లక్షల కి.మీల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ పాయింట్ ఎల్1ని చేరుకుంటుంది. ఇక ఈ ప్రయోగం కోసం రూ.358 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా ఇస్రో తెలిపింది. అలాగే ఈ శాటిలైట్ లైఫ్ టైమ్ 5 ఏళ్లకు పైగానే ఉంటుంది అంటున్నరు శాస్త్రవేత్తలు…

ఆదిత్య L1 ప్రత్యేకత… పీఎస్ఎల్వి సి 57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 నింగిలోకి వెళ్లనుంది. సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యునికి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లుగా ఉంది. ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై పరిశోధనలు జరిపేందుకు ఎల్1 లాంగ్రేజ్ పాయింట్‌లో అంటే భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించనున్నారు…

Aditya L1 Launch : సూర్యుడి పరిశోధనల కోసం చేపట్టిన ఆదిత్య ఎల్1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్‌ నుంచి శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌ 1ను PSLV-C57 వాహకనౌక నింగిలోకి పంపించింది.