సెప్టెంబరు 2న సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు తొలి అంతరిక్ష భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1..

ఇందుకోసం ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకను సెప్టెంబరు 2 ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ఆగస్టు 28న ట్విటర్‌లో తెలిపింది..

ఇందుకోసం ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకను సెప్టెంబరు 2 ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ఆగస్టు 28న ట్విటర్‌లో తెలిపింది..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. సూర్యుడిపై కన్నేసింది. సెప్టెంబరు 2న సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు తొలి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. “సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు అంతరిక్షం-ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2న 11:50 గంటలకు శ్రీహరికోట నుంచి జరగనుంది. ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తున్నాం.శ్రీహరికోటలోని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి లాంచ్‌ను చూసేందుకు ఆహ్వానిస్తున్నాం. https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..” అని ఇస్రో తెలిపింది…ఆదిత్య L1 సూర్యుని గురించి అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్. అంతరిక్ష నౌకను భూమి నుంచి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక హాలో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఉంచిన ఉపగ్రహం ఎటువంటి క్షుద్ర/గ్రహణాలు లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఇది సౌర కార్యకలాపాలను, రియల్ టైమ్‌లో అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని గమనించడంలో ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది.

విశ్వం కోటానుకోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తుంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం.

భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే, విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడి లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమ్మీద సృష్టించి, వాటిపై పరిశోధనలు చేయడం అసాధ్యం.

అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇస్రో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయోగమే ఆదిత్య L1..