ఆదిలాబాద్ లో కలకలం.ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తుండగా . థియేటర్ లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు..!

ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తుండగా ఇద్దరు యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది..సీట్ నంబర్లు సీ-7, సీ-8లో కూర్చున్న యువకులు పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆగ్రహం చెందిన తోటి ప్రేక్షకులు నినాదాలు చేస్తున్న ఇద్దరిని చితకబాదారు…దీంతో ఆ ఇద్దరు థియేటర్‌లో నుంచి బయటికి పరారయ్యారు. నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఆకతాయిలు గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…… ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు ఆ ఇద్దరిని ప్రేక్షకులు చితకబాదడం తో అక్కడి నుండి పరారు అయ్యారు… కేవలం సినిమా చూసేటప్పుడు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో ఆకతాయిలు వచ్చినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అనే ఆలోచన ప్రేక్షకులు వ్యక్తం చేస్తూన్నారు… అయితే ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతుంది ఈ వ్యక్తులు ఎవ్వరూ ఏమిటి… ఇంకా పట్టకపోవడంతో ఏమిటి అనే అంశం కొంత చర్చనీయాంశంగా మారింది..