ఇండియా వైడ్ 4 వేలకు పైగా స్క్రీన్స్‌లో భారీ స్థాయిలో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియా వైడ్ 4 వేలకు పైగా స్క్రీన్స్‌లో భారీ స్థాయిలో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు సైతం పడిపోయాయి. అయితే ఇంటర్వెల్ వరకు వీక్షించిన ఆడియన్స్ ఫస్టాఫ్ బాగుందని చెబుతున్నారు. రాముడు వనవాసం సీన్లతో ఫస్టాఫ్ మొదలవుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, VFX, 3D సీన్లు ఆకట్టుకుంటాయి. రాముడిగా ప్రభాస్ సినిమాకు పెద్ద ప్లస్. హనుమంతుడి ఎపిసోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవుతారు. సెకండాఫ్, పూర్తి రివ్వూ కాసేపట్లో చూద్దాం.