ఆదిపురుష్’ రివ్యూ

Adi Purush Movie REVIEW: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్(Adi Purush) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. సుమారు 7000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆది పురుష్ మూవీ….

నటీనటులు :
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవ్ దత్త నాగే తదితరులు..
డైరెక్షన్ : ఓం రౌత్
సంగీతం : సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

ఈ సినిమాకు సంచిత్ బల్హర, అంకిత్ బల్హర లు స్కోర్ అందించగా అజయ్ – అతుల్, సాచెట్ – పరంపర సంగీతాన్ని అందించారు.ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు వెలువడ్డాయి.రామాయణం తెలిసిన కథ అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సినిమాపై బాగా ఆసక్తి పెంచుకున్నారు..

కథ :
దశరథ మహారాజు ( ప్రభాస్) వృద్ధాప్యంలో రాజ్యపాలన నుండి విముక్తుడై తన పెద్ద కొడుకు రాఘవ్ ( ప్రభాస్)ను అయోధ్య మహానగరంకు రాజుని చెయ్యాలని అనుకుంటారు.. కానీ మహారాజు రెండవ భార్య కైకేయి మాత్రం రాఘవుడికి బదులుగా తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలనీ అలాగే రాముడికి 14 ఏళ్ల వనవాసం విధించాలని కోరుతుంది..
రాముడు దశరథుడి ఆజ్ఞ ప్రకారం భార్య జానకి (కృతి సనన్) ను లక్ష్మణుడితో కలిసి వనవాసం వెళ్ళినప్పుడు సూర్పనక్క లక్ష్మణుడిని వరిస్తుంది.. అందుకు లక్ష్మణుడు ఇష్టం లేదని చెప్పడంతో పగ పెంచుకుని రాక్షస సైన్యంతో దాడులు చేస్తుంది. సీత దేవికి గాయాలు అవ్వడంతో లక్ష్మణుడు ఆగ్రహించు సూర్పనక్క ముక్కు కోసేస్తాడు.. ఆ తర్వాత ఈమె తన అన్నయ్య రావణుడు ( సైఫ్ అలీ ఖాన్ ) కు చెప్పింది.
ఆయన సీత దేవిని అపహరిస్తాడు. అశోకవనంలో బంధించిన రావణాసురుడును జయించి ఆయనతో యుద్ధం చేసి సీతా దేవిని ఎలా తీసుకు వచ్చాడు? అందుకు వానరసైన్యం చేసిన సహాయం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాడు..

సినిమా స్టొరీ పాయింట్ అందరికీ తెలిసిన రామాయణ కథనే అయినా కానీ మొదలు పెట్టిన విధానం, తర్వాత కథ మొత్తం కూడా ఆసక్తిగా తెరకెక్కించారని చెప్పొచ్చు. కథ అందరికీ తెలిసిందే అయినా కూడా…విజువల్స్ పరంగా మాత్రం అబ్బుర పరిచే గ్రాండియర్ తో చాలా రిచ్ గా సినిమా ఉందని అంటున్నారు, కొన్ని కొన్ని చోట్ల 3D షాట్స్ నిజంగానే మెస్మరైజ్ చేయడం ఖాయమని అంటున్నారు, రాముడిగా ప్రభాస్ ఎంత బాగా సెట్ అయ్యాడో తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ డైలాగ్స్ కానీ అద్బుతంగా మెప్పించాయని అంటున్నారు..
ఇటువంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు.కానీ తొలిసారిగా రాముడు పాత్రలో కనిపించిన ప్రభాస్ అద్భుతంగా నటించాడు.తన ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేశాడు…
మాయలేడి రాముడు గొంతుతో అరవటం, సీత వెంటనే శేష్ ని కూడా రాముడికి సాయంగా వెళ్ళమంటుంది. శేష్ వెళ్లిన తరువాత రావణుడు (సైఫ్ అలీ ఖాన్) సన్యాసి వేషంలో సీత దగ్గరకి భిక్షకి రావటం, సీత బయటకి వచ్చి బిక్ష వేస్తుండగా రావణాసురుడు ఆమెను ఎత్తుకుపోతాడు. రాముడు, శేష్ అది మాయలేడి అని తెలుసుకొని తిరిగి వచ్చిన తరువాత జటాయువు రావణ అని పేరు చెప్పి మరణిస్తుంది. #AdipurushReview రాముడు అప్పుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకొని వానర సైన్యం సహాయం కోరతాడు. అక్కడే హనుమ (దేవదత్త నగె) కూడా కలుస్తాడు. వానర సైన్యంతో రావణుడు మీద యుద్దానికి వెళ్లి రావణుడు ఎత్తుకుపోయిన సీతను తిరిగి రాముడు పొందుతాడు. ఇది టూకీగా కథ..

పైగా తన లుక్ కూడా బాగా ఆకట్టుకుంది.ఇక జానకి పాత్రలో నటించిన కృతి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.

సైఫ్ కూడా లంకేశ్వరుడు పాత్రలో అదరగొట్టాడు.ఇక హనుమంతు పాత్ర కూడా ప్లస్ పాయింట్ గా నిలిచింది.

మిగతా నటీనటులంతా పాత్రకు తగ్గట్టు న్యాయం చేశారు.

టెక్నికల్: టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ ఓం రౌత్( Director Om Rauth ) అందరికీ తెలిసిన కథనే మరోసారి చూపించాడు.పాత్రలకు తగ్గట్టుగా నటి నటులను ఎంచుకోగా లంకేశ్వరుడు పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ కు లుక్ అంత సెట్ అవ్వలేదు అన్నట్లు అనిపించింది.సంగీతం బాగా ఆకట్టుకుంది.500 కోట్ల రూపాయలు పెట్టిన ఈ సినిమాలో కొన్ని లోపాలు కనిపించినట్లు అనిపించాయి.అంటే విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ ఎక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ..

.జాన‌కి పాత్ర‌కి తెర‌పైన ఎక్కువ‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. అయినా స‌రే, అందులో కృతిస‌న‌న్ చాలా హుందాగా, అందంగా క‌నిపించారు. రాముడికి త‌గ్గ సీత అనిపించుకున్నారు.లంకేశ్‌గా రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ప‌తాక స‌న్నివేశాల్లో సైఫ్ అలీఖాన్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీసింగ్‌, హ‌నుమంతుడిగా దేవ్‌ద‌త్ చక్కగా నటించారు. మిగిలిన పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు అనే టాక్ నడుస్తోంది…

విఎఫ్ఎక్స్ మీద అంచనాలతో వెళితే మిమ్మల్ని ఈ సినిమా మెప్పించక పోవచ్చు.. మాములుగా టేకింగ్ పరంగా అయితే అందరిని ఆకట్టు కుంటుంది.. మరి ఈ సినిమా వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి..
రేటింగ్ : 2.75 / 5..