శ్రీరాముడే ప్రధాని మోడీని ఎంచుకున్నారు.. తను కేవలం రథసారధిని మాత్రమే. అంటు ఆసక్తికర వ్యాఖ్యలు..!.

అయోధ్య (Ayodhya) రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ కీలకనేత ఎల్‌కే అద్వానీ (LK Advani) హాజరు కానున్నారా..? అంటే అవుననే అంటున్నాయి విశ్వహిందూ పరిషత్‌ (VHP) వర్గాలు. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత అద్వానీ హాజరుకానున్నట్లు వీహెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది…
అయోధ్యంలో రామాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ కూడా ఆహ్వానించారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ సోమనాథ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర డిసెంబర్ 6, 1992న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేవరకు అద్వానీ రథయాత్ర సాగింది…
ఒక విధంగా చెప్పాలంటే రామాలయ నిర్మాణంలో అద్వానీది ప్రముఖమైన పాత్ర. ఆయన రథయాత్రతోనే రామమందిర నిర్మాణం అనేది జనాల్లో నాటుకుపోయింది. అద్వానీతో పాటు మరో సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషిలు 1990లో రథయాత్రకు నాయకత్వం వహించారు..జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇదే రథయాత్ర సమయంలో అద్వానీకి మోడీ సహాయకుడిగా ఉన్నారు. ‘రాష్ట్రధర్మ’ అనే మ్యాగజైన్‌తో మాట్లాడిన అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్టికల్ సోమవారం విడుదల కాబోతోంది. రామాలయం భారతీయులందరూ శ్రీరాముడి గుణాలను అలవర్చుకునేలా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నట్లు అద్వానీ చెప్పారు. రథయాత్ర సాగే సమయంలో తాను కేవలం ‘రథసారధి’ మాత్రమే అని భావించానని అద్వానీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు….అద్వానీ, ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలియజేశారు. రాముడి ఆలయాన్ని పునరద్దరించడానికి ప్రధానిమోడీని ఎంచుకున్న భక్తుడని అన్నారు. తన రాజకీయ జీవితంతో అత్యంత నిర్ణయాత్మక, పరివర్తనాత్మక సంఘటన అని అద్వానీ అభివర్ణించారు. ఇది భారతదేశం తనను తాను తిరిగి కనుగొనే అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ ఆలయ ప్రతిష్ట చేసేటప్పుడు, భారతదేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తారని అద్వానీ చెప్పారు…