హుజూర్ నగర్ లొ న్యాయవాదుల విధుల బహిష్కరణ

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో న్యాయవాది సంతోష్ నాయక్ పై కొందరు దుండగులు దాడి చేసి గాయపరచడాన్ని తీవ్రంగా నిరసిస్తూ సోమవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దుండగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని గిరిజనుడు అయిన యువ న్యాయవాది పై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దుండగులు ఎంతటివారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. న్యాయవాదుల రక్షణ కొరకు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించి వెంటనే అమలుచేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, కుక్కడపు నరసింహారావు, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, జక్కుల వీరయ్య, వొట్టికూటి అంజయ్య, సురేష్ నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, బాలాజీ నాయక్, సైదా హుస్సేన్, మీసాల అంజయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, రామినేని వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి, కొట్టు సురేష్, కమతం నాగార్జున,లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.