రెండవ రోజు కొనసాగిన న్యాయవాదుల నిరసనలు…

రెండవ రోజు కొనసాగిన న్యాయవాదుల నిరసనలు..

హుజూర్ నగర్….

తెలంగాణ హైకోర్టు న్యాయవాది దంపతులైన వామనరావు, నాగమణి ల దారుణ హత్య ను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రెండో రోజైన శుక్రవారం కూడా తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల హత్య కేసును విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణను ముగించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, న్యాయవాదులు చన గా ని యాదగిరి, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, వట్టికూటి అంజయ్య, జక్కుల వీరయ్య, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, చన గాని మహేష్, మీసాల అంజయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, గొట్టే ప్రశాంత్, కమతం నాగార్జున, సైదా హుస్సేన్, వెంకటేష్ నాయక్, కు క్కడపు సైదులు, పిడమర్తి చంద్రయ్య, రామ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.