విమానంలో నటి వేధింపులు సిబ్బందికి ఫిర్యాదు

మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన నటి దివ్య ప్రభా విమానంలో వేధింపులకు గురయ్యారు. విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కేరళ పోలీసులకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అక్టోబర్‌ 10వ తేదీన సాయంత్రం ఎయిర్‌ ఇండియా విమానంలో ముంబయి నుంచి కొచ్చికి ప్రయాణం చేసినట్టు తన ఫిర్యాదులో తెలిపారు.
తన పక్క సీటులో ఉన్న ప్రయాణికుడి వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. మద్యం తాగిన అతడు టేకాఫ్‌కు ముందేనుంచే తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వాళ్లు తన సీటును మార్చారని తెలిపారు.