చేజేతులా ఓడిన అఫ్గానిస్థాన్‌…

AUS vs AFG: మ్యాక్స్‘వెల్’ వీరోచిత పోరు.. ముంబైలో వన్ మెన్ షోతో ఆసీస్ విజయం..

ముంబయి వాంఖెడే స్టేడియంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఆఫ్ఘనిస్థాన్ తో పోరులో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ మరో సంచలనం సాధించడం లాంఛనమేనని అందరూ భావించారు. అసలు, ఆసీస్ ఆటగాళ్లే తమ జట్టు గెలుస్తుందని అనుకుని ఉండరు.
కానీ గ్లెన్ మ్యాక్స్ వెల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మ్యాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ ను ముజీబ్ జారవిడవడం ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు టోర్నీలో సెమీస్ చాన్సును దూరం చేసింది. ఆ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన మ్యాక్స్ వెల్ ఆ తర్వాత ప్రళయకాల రుద్రుడిలా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.

ఆఫ్ఘన్ బౌలింగ్ ను అలా ఇలా కొట్టలేదు… కొడితే బంతి స్టాండ్స్ లో పడాలి అన్నంత కసిగా కొట్టాడు. మ్యాక్స్ వెల్ విజృంభణతో 292 పరుగుల టార్గెట్ కూడా చూస్తుండగానే కరిగిపోయింది. ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ స్కోరులో 21 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రీతిన సాగిందో..

ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ స్కోరులో 21 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు.

మధ్యలో కాలి కండరాలు పట్టేసి నిలబడడానికే ఇబ్బంది పడిన మ్యాక్స్ వెల్ మొండిపట్టుదలతో ఇన్నింగ్స్ కొనసాగించి ఆసీస్ జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. మ్యాక్సీ చలవతో ఆసీస్ ఈ మ్యాచ్ లో 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసి విజయం సాధించారు…

Home Sports Aus Vs Afg Glenn Maxwell Show In Wankhede Australia Beat Afghanistan By 3 Wickets
AUS vs AFG: మ్యాక్స్‘వెల్’ వీరోచిత పోరు.. ముంబైలో వన్ మెన్ షోతో ఆసీస్ అద్భుతం.. AUS vs AFG: ముంబైలో అఫ్గాన్‌ నిర్దేశించిన 292 పరుగుల ఛేదనలో 91-7గా ఉన్న ఆసీస్‌… ఈ స్థితిలో మ్యాచ్‌ గెలవడం పక్కనబెడితే కనీసం 150 అయినా కొడతారా..? అఫ్గాన్‌ సంచలనం నమోదుచేయడం లాంఛనమే.. అన్న క్రికెట్‌ అభిమానుల ఆశలను ఓ విధ్వంసకవీరుడు సమూలంగా తుడిచేశాడు.
ఎప్పుడెలా ఆడతాడో తెలియని ఆసీస్‌ హిట్టర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (128 బంతుల్లో 201 నాటౌట్‌, 21 ఫోర్లు, 10 సిక్సర్లు) అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒక్కో పరుగును కూడగడుతూ అర్థ సెంచరీ చేసిన మ్యాక్సీ.. ఆ తర్వాత గేర్‌ మార్చాడు. ఫోర్లు, బౌండరీలతో వాంఖెడేలో శివాలెత్తాడు. అవతలి ఎండ్‌లో ఆసీస్‌ సారథి పాట్‌ కమిన్స్‌ (68 బంతుల్లో 12 నాటౌట్‌, 1 ఫోర్‌) ను ఉంచి ఆసీస్‌ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నాడు. సెంచరీ తర్వాత కాలిగాయం వేధించినా.. క్రీజు నుంచి కదలడానికి కాళ్లు సహకరించకున్నా పోరాటం విడవలేదు. మ్యాక్సీ పోరాట ఫలితంతో.. ఆసీస్‌ అద్భుతం చేసింది. 292 పరుగుల లక్ష్యాన్ని 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్‌ ఛేదించిన స్కోరులో మిగిలిన బ్యాటర్లంతా చేసింది 92 పరుగులైతే మ్యాక్సీ చేసింది 201. ఇది కదా వన్‌ మ్యాన్‌ షో అంటే..! ఇక మ్యాక్స్‌వెల్‌-కమిన్స్‌లు ఎనిమిదో వికెట్‌కు 170 బంతుల్లో 202 పరగులు జోడిస్తే అందులో కమిన్స్‌ చేసినవి 12 పరుగులు.

ఆసీస్‌కు ఆదిలోనే చుక్కలు..

292 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ను అఫ్గాన్‌ బౌలర్లు వణికించారు. నవీన్‌ ఉల్‌ హక్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌లు ఆసీస్‌కు ప్రారంభ ఓవర్లలోనే ఆసీస్‌కు చుక్కలు చూపించారు. నవీన్‌ ఉల్‌ హక్‌.. ట్రావిస్‌ హెడ్‌ (0)తో పాటు మిచెల్‌ మార్ష్‌ (11 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లను ఔట్‌ చేశాడు. అజ్మతుల్లా వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి డేవిడ్‌ వార్నర్‌ (29 బంతుల్లో 18, 3 ఫోర్లు) బౌల్డ్‌ చేశాడు. ఆ మరుసటి బంతికే జోస్‌ ఇంగ్లిస్‌ (0) కూడా స్లిప్స్‌లో ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

మ్యాక్స్‌వెల్‌ పోరాటం..

18.3 ఓవర్లలో 91-7గా ఉన్న ఆసీస్‌ ఓటమి ఖాయమే అనుకున్నారంతా. కానీ ఎప్పుడెలా ఆడతాడో తెలియని విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ తనలోని అసలు ఆటను బయటకు తీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో ఆడుతూ అఫ్గాన్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన 22వ ఓవర్లో ఐదో బంతికి మ్యాక్సీ ఇచ్చిన క్యాచ్‌ను షాట్‌ ఫైన్‌ వద్ద ముజీబ్‌ మిస్‌ చేశాడు. దీనికి అఫ్గాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. దీనికి తోడు రెండు ఎల్బీ రివ్యూలు కూడా అతడికి అనుకూలంగా వచ్చాయి. 50 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న మ్యాక్సీ.. ఆ తర్వాత ఆగలేదు. ఒక ఎండ్‌లో కమిన్స్‌ను నిలబెట్టి అఫ్గాన్‌ బౌలర్లను ఆటాడుకున్నాడు. భారీ షాట్లు ఆడుతూ వారిలో గెలవాలనే ఆలోచనను, గెలుస్తామనే ఆశను తుడిచేశాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన 29వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన మ్యాక్సీ.. ముజీబ్‌ వేసిన 32వ ఓవర్లో 4,6తో సెంచరీకి చేరువయ్యాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన 33వ ఓవర్లో రెండో బంతికి సింగిల్‌ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ చేయడానికి 50 బంతులు తీసుకున్న మ్యాక్సీకి.. తర్వాత యాభై పరుగుల కోసం 26 బంతులే అవసరమయ్యాయి. సెంచరీ తర్వాత మ్యాక్స్‌వెల్‌ దాడి మరింత పెరిగిపోయింది. కాలు నొప్పి వేధించినా మ్యాక్సీ సింగిల్స్‌ కోసం వెంపర్లాడకుండా బౌండరీలు బాదడం మీదే దృష్టి పెట్టడంతో ఆసీస్‌ లక్ష్యానికి మరింత చేరువైంది. గాయం వేధించినప్పుడు ఆసీస్‌ అతడిని రిటైర్డ్‌ కావాలని, తర్వాత బ్యాటర్‌ను పిలిచినా అతడు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ లైన్‌ దాటించి ఆసీస్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆఖర్లో ముజీబ్‌ వేసిన 47వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్‌ బాది డబుల్‌ సెంచరీ సాధించడంతో పాటు ఆసీస్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి డబుల్‌ సెంచరీ కాగా.. ఆసీస్‌ కు ప్రపంచకప్‌లలో ఇదే మొదటిది కావడం గమనార్హం.