అఫ్గానిస్తాన్‌ మరో విజయం …పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలకు గండి..!

వరల్డ్ కప్ లో అంచనాలకు ఏ మాత్రం అందకుండా ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక మరియు నెదర్లాండ్ జట్లను ఓడించి సెమీస్ వైపుకు దూసుకువెళుతోంది.సెమీస్ కు వెళ్లాలంటే ఆఫ్గనిస్తాన్ ఆడనున్న తర్వాత రెండు మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిందే.
ప్రపంచకప్లో సంచలన విజయాలు నమోదు చేసిన నెదర్లాండ్స్ – అఫ్గానిస్థాన్ జట్లు లఖ్నవూ వేదికగా శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ నిర్దేశించిన 180 పరుగుల టార్గెట్ను.. అఫ్గానిస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 31.3 ఓవర్లలో ఛేదించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటర్లు రహ్మత్ షా (52 పరుగులు), కెప్టెన్ హశ్మతుల్లా షాహిదీ (56*పరుగులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అజ్మతుల్లా ఓమర్జాయ్ (31*) రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బిక్, రియోల్ఫ్ వెండర్మెర్వ్, జుల్ఫికర్ తలో వికెట్ దక్కించుకున్నారు. మూడు వికెట్లతో రాణించిన అఫ్గాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ లభించింది. ఇక ఈ గెలుపుతో అఫ్గాన్.. మెగాటోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.

లేదా ఒకటి గెలిచినా మిగిలిన టీం ఫలితాల మీద ఆధారపడవల్సి ఉంది. కానీ ఆఫ్గనిస్తాన్ ఆడవాల్సిన రెండు మ్యాచ్ లు కూడా భారీ టీం ల మీదనే.. ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లతో ఆడనుంది. కాగా ఈ రోజు మ్యాచ్ ను గెలవడం ద్వారస వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్ లు గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కి క్వాలిఫై అయింది. ఈ ఘనత మొదటిసారి సాధించడంతో ఆ జట్టు ఆటగాళ్లతో సహా అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు.

ఈ జట్టు నుండి మేము ఈ తరహా ప్రదర్శన అస్సలు ఊహించలేదు అంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక ఇప్పటి వరకు చూస్తే మరో రెండు జట్లకు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీ కి అర్హత సాధించే అవకాశం ఉంది. మరి ఆ జట్లు ఏమిటో తెలియాలంటే మరికొన్ని మ్యాచ్ లు ఎదురుచూడాలి.

అఫ్గానిస్తాన్‌ మరో విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలకు గండికొట్టింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన 34వ లీగ్‌ మ్యాచ్‌లో అఫ్గాన్‌ గెలుపొందింది…

నెదర్లాండ్స్‌ను ఓడించిన తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అఫ్గానిస్తాన్‌.. ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మూడు, నాలుగో స్థానాల్లో ఉన్న ఆసీస్‌, కివీస్‌ ఖాతాలో కూడా 8 పాయింట్లే ఉన్నా నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో ఆ రెండు జట్లు టాప్‌- 3, 4లో నిలిచాయి. అయితే సెమీస్‌ చేరాలంటే పాకిస్తాన్‌ తాము తర్వాత ఆడబోయే న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండ్‌ను ఓడించాలి. అంతేగాక అఫ్గానిస్తాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు తాము తర్వాత ఆడబోయే మ్యాచ్‌లలో ఓడాలి. ఇదే సమయంలో సెమీస్‌ చేరడానికి అఫ్గాన్‌ కు కూడా అవకాశం ఉంది. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లలో కూడా అఫ్గాన్‌ ఇదే జోరు కొనసాగించి విజయాలు సాధిస్తే ఆ జట్టు క్రికెట్‌ చరిత్రలో నూతన అధ్యాయం లిఖించడం పెద్ద కష్టమేమీ కాదు.