*Afghanistan Earthquake: ఆఫ్గన్‌లో 1000కి చేరిన మరణాలు.. భూకంక తీవ్రతను కళ్లకు కడుతున్న దృశ్యాలు..
ఆఫ్ఘనిస్తాన్‌లో ఎటు చూసిన గుండెను పిండేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ భూప్రకంపనల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయాడు. ఎటు చూసినా శిథిలాలు.. ఆ శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ప్రజల నిర్జీవ శరీరాలు కనిపిస్తున్నాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 1,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కానీ, అనధికారికంగా ఈ సంఖ్య 2,000 ఉంటుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అధికారికంగా అయితే ఇప్పటి వరకు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం వరుసగా ఏడుసార్లు తీవ్ర భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.3గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ఆప్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలోని ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి. మొత్తం మట్టిదిబ్బల్లా మారిపోయాయి. భూప్రకంపనల కారణంగా కూలిపోయిన ఇళ్ల శిథిలాల మధ్య వేలాది మంది ప్రజలు చిక్కుకున్నారు. అక్కడి అధికారులు శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు..