అఫ్గానిస్థాన్‌ నుండి జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం…బిపిన్‌ రావత్‌..

అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం ఉందని బిపిన్‌ రావత్‌ అన్నారు. దీనికి భారత్‌ సిద్ధంగా ఉండాల్సిన అసవరం ఉందన్నారు. సరిహద్దుల్ని మూసివేయాల్సి రావొచ్చన్నారు. ముమ్మర తనిఖీలు అవసరమన్నారు. బయటి నుంచి ఎవరు వస్తున్నారో నిఘా ఉంచాలన్నారు. సామాన్యులు, పర్యాటకులు భారీ తనిఖీలకు గురికావొచ్చన్నారు. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. దేశ భద్రత ప్రతిఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. అలాగే దేశంలో అంతర్గతంగానూ శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు..