ఆఫ్రికాలో వెలుగు చూసిన మ‌రో భ‌యంక‌ర‌మైన వ్యాధి…ఇప్ప‌టికే 89 మంది మృతి… ఒమిక్రాన్ క‌న్నా డేంజ‌ర్..

సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ అనే కొత్త రకం క‌రోనా వైర‌స్ తొలిసారి వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా నుంచి ఆ వైర‌స్.. ప‌లు దేశాల‌కు వ్యాపించింది. దీంతో ప్ర‌పంచం మొత్తం ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయిపోయింది. తొలిసారి వైర‌స్ వెలుగు చూసిన సౌత్ ఆఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి.ఆఫ్రికాను మ‌రో వ్యాధి భ‌య‌పెడుతోంది. ఓవైపు ఒమిక్రాన్‌తో జ‌నాలు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతుంటే మ‌రోవైపు సౌత్ సూడాన్‌లో ఓ మిస్ట‌రీ వ్యాధి జ‌నాల‌ను భ‌య‌కంపితుల‌ను చేస్తోంది. ద‌క్షిణ సూడాన్‌లోని జోంగ్లీ రాష్ట్రంలో ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రాన్ని వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. దీంతో అక్క‌డ చాలా వ్యాధులు వ్యాప్తి చెందాయి. ముఖ్యంగా దోమ‌ల వ‌ల్ల మ‌లేరియా రావ‌డం, వ‌ర‌ద‌ల వ‌ల్ల కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు మూడు పూట‌లా ఆహారం కూడా దొర‌క‌క‌పోవడంతో చాలామంది పిల్ల‌ల్లో పౌష్టికాహార‌లోపం తలెత్తింది. తాగే నీళ్లు క‌లుషితం అయ్యాయి. దీంతో జోంగ్లీలోని ఫంగ‌క్ అనే న‌గ‌రంలో 89 మంది మ‌ర‌ణించిన‌ట్టు సౌత్ సుడాన్ మంత్రి కుగ్వాంగ్ స్ప‌ష్టం చేశారు…అస‌లు వీళ్ల‌కు ఏ వ్యాధి సోకిందో తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు వైద్యాధికారులు. చాలామంది తీవ్ర అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు. వేల మంది అనారోగ్యానికి లోన‌య్యారు. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూడాన్‌కు కొంద‌రు సైంటిస్టుల బృందాన్ని పంపి.. అక్క‌డ సోకిన వ్యాధి గురించి ఆరా తీయాల‌ని తెలిపింది. వాతావ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల ఏదైనా భ‌యంక‌ర‌మైన వైర‌స్ సోకిందా? లేక ఇత‌ర వ్యాధి సోకిందా అనే ప‌నిలో ప‌డ్డారు సైంటిస్టులు…ఇటీవ‌ల జోంగ్లీలో కురిసిన వ‌ర్షాల‌కు, వ‌ర‌ద‌ల‌కు సుమారు 7 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఆ వ‌ర‌ద‌ల వ‌ల్ల కొత్త కొత్త రోగాలు వ‌చ్చి ఇప్పుడు ప్ర‌జ‌ల ప్రాణాల మీదికి రావడంతో అక్క‌డ ప‌నిచేసే స్వ‌చ్ఛంద సంస్థ ఎంఎస్ఎఫ్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది