అగ్ని ప్రైమ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం….

R9TELUGUNEWS.COM. బాలాసోర్‌.ఒడిశా.: వ్యూహాత్మక అగ్ని ప్రైమ్‌ క్షిపణిని నేడు భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భాగమైన దీనిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌ వద్ద పరీక్షించారు. అగ్ని-పి అనేది కొత్తతరం అత్యాధునిక రూపాంతరం గల అగ్ని శ్రేణి క్షిపణి.ఇది 1000-2000 కిలో మీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలది.ఈ అగ్నిప్రైమ్‌ క్షిపణికి కొత్త ఫీచర్లను అనుసంధానం చేసి పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి అధిక స్థాయి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపారు. క్షిపణిని చివరిగా ఈఏడు జూన్‌ 28న పరీక్షించారు. నేడు జరిపిన పరీక్ష ద్వారా క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధికి చేరువైందని త్వరలో సైన్యంలో ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.అత్యాధునిక సాంకేతికత, సామర్థ్యాలను ప్రయోగించడం ద్వారా దేశం వ్యూహాత్మక క్షిపణుల ఆయుధాగారాన్ని మరింత బలోపేతం చేసే పనిలో ఉంది. ఇటీవల అగ్ని-5 క్షిపణిని కూడా దేశం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.