ఆలహాబాద్‌లో దళిత నాయకుడు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఘోర అవమానం..బీజేపీ ఆరోపణ…!!

ఆలహాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దళిత నాయకుడు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఘోర అవమానం జరిగిందని చర్చ జరుగుతోంది…సమావేశంలో ఆయనకు ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్యలో సోఫాలో కూర్చున్నారని బీజేపీ ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్‌ అమిత్ మాల్వియా ఈ అంశాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. ‘మొదట ఖర్గే జీని గౌరవించడం నేర్చుకోండి. ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు. తన కుర్చీని పక్కన పెట్టడం ఏంటి? దీన్ని బట్టి కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని స్పష్టంగా తెలుస్తుంది.’ అని రాసుకొచ్చారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. భారతీయ జనతా పార్టీ మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ దళిత వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు…

https://x.com/amitmalviya/status/1909832318652760360?t=st8SB91RQZ6fXNOFE85L3Q&s=19