జనరేటివ్ ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగాన్ని అరికట్టెల కేంద్రం కీలక సవరణలు….!

జనరేటివ్ ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (MeitY) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 22నల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021కి పలు సవరణలు ప్రతిపాదిస్తూ, ఓ ముసాయిదాను విడుదల చేసింది.

దీని ప్రకారం, సోషల్ మీడియా వేదికల్లో కృత్రిమంగా రూపొందిన కంటెంట్‌ను స్పష్టంగా లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, కృత్రిమమేథ (ఏఐ) ద్వారా తయారు చేసిన కంటెంట్, డీప్‌ఫేక్ కంటెంట్ అని సదరు వీడియో లేదా ఆడియో గురించి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ఇంటర్మీడియరీస్ (ఎస్ఎస్ఎంఐ) తప్పనిసరిగా లేబులింగ్, మెటాడేటా ట్యాగింగ్, విజిబిలిటీ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వీడియో అయితే కనిపించే విధంగా, ఆడియో అయితే వినిపించే విధంగా ఏఐ, డీప్‌ఫేక్ కంటెంట్ అని స్పష్టంగా లేబుల్ చేయవలసి ఉంటుంది..భారత్‌లో 5 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు కలిగిన ఎస్ఎస్ఎంఐలు ఉన్నాయి. వీటిలో ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్ మొదలైన ప్లాట్ ఫారమ్స్లు 2021 ఐటీ నిబంధనల ప్రకారం అదనపు సమ్మతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

లేబులింగ్ ఎలా ఉండాలంటే?.

ప్రతిపాదిత ఐటీ నియమం 3(3) ప్రకారం, కృత్రిమంగా (సింథటిక్) తయారు చేసిన కంటెంట్‌ను సృష్టించడానికి వీలు కల్పించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అవి ఏమిటంటే, ఏఐ, డీప్‌ఫేక్ కంటెంట్‌కు కచ్చితంగా ‘శాశ్వతమైన ప్రత్యేక మెటాడేటా లేదా ఐడెంటిఫైయర్’తో లేబులింగ్ పొందుపరిచేలా చూసుకోవాలి. పైగా ఆ ఐడెంటిఫైయర్ స్పష్టంగా కనిపించేలా లేదా వినగలిగేలా ఉండాలి…ముఖ్యంగా “విజువల్ డిస్ప్లే (వీడియో లేదా ఇమేజ్) అయితే దాని ఉపరితల వైశాల్యంలో కనీసం 10 శాతం ఐడెంటిఫైయర్ కనిపించాలి. ఒకవేళ అది ఆడియో అయితే దాని మొత్తం వ్యవధిలో కనీసం 10 శాతాన్ని కవర్ చేసేలా ఉండాలి. అంతేకాదు మెటా డేటా లేదా ఐడెంటిఫైయర్‌ను మార్చకూడదు. సప్రస్ చేయడం (అణచివేయడం), తీసివేయడం లాంటివి చేయకూడదు” అని ముసాయిదా నియమాలు స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు సింథటిక్ కంటెంట్ సృష్టించడానికి లేదా సవరించడానికి వీలు కల్పించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు- అప్లోడ్ చేసిన కంటెంట్ ఏఐ ద్వారా సృష్టించబడిందని ధ్రువీకరించడానికి, ప్రకటించడానికి తగి సాంకేతిక మార్పులు, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పేర్కొంది.

తప్పుడు సమాచారం అరికట్టడమే లక్ష్యం!
ఏఐ, డీప్‌ఫేక్ ద్వారా నిడిచే తప్పుడు సమాచారాన్ని అరికట్టడం, ప్రజలను వంచనకు గురికాకుండా తప్పించడం, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే పరిస్థితులను నివారించడమే లక్ష్యంగా ఈ తాజా ప్రతిపాదనలు చేసినట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఓపెన్‌గా, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీ ఇంటర్నెట్ను నిర్వహించడానికి ఈ చర్యలు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాదు, ఈ ముసాయిదాపై స్టేక్‌హోల్డర్స్ తమ అభిప్రాయాన్ని 2025 నవంబర్ 6 లోపు తెలియజేయాలని సూచించింది. ఇందుకోసం itrules.consultation@meity.gov.in ద్వారా ఈ-మెయిల్ చేయవచ్చని సూచించింది…